Home> ఆధ్యాత్మికం
Advertisement

Shukra Gochar: 2023లో ఈ రాశులకు శుక్రుడి ఆశీస్సులు.. వీరికి డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..

Venus transit 2023: కొత్త ఏడాదిలో శుక్రుడి స్థానంలో పెను మార్పు రానుంది. శుక్రుడి యెుక్క రాశి మార్పు కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. 
 

Shukra Gochar: 2023లో ఈ రాశులకు శుక్రుడి ఆశీస్సులు.. వీరికి డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..

Shukra Gochar 2023: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. ఎవరి జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటాడో ఆ వ్యక్తి లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ కుండలిలో శుక్రుడి సంచారం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఫిబ్రవరి 05న శుక్రుడు మీన రాశిలో (Shukra Gochar 2023) సంచరించనున్నాడు. శుక్ర సంచారం వల్ల మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. శుక్ర సంచారం వల్ల ఏ రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం. 

తుల రాశి (Libra): శుక్రుని సంచారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ జాతకంలో ఆరో ఇంట్లో సంచరించబోతుంది. మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీరు కెరీర్‌లో మంచి పురోగతిని సాధిస్తారు. బిజినెస్ లో భారీగా లాభాలు ఉంటాయి. వివిధ మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. 

కన్య రాశి (Virgo): శుక్రుడి సంచారం కన్యారాశి వారికి మేలు చేస్తుంది. ఎందుకంటే శుక్రుడు మీ రాశి యెుక్క ఏడో ఇంట్లో శుక్ర సంచారం జరగబోతుంది. దీంతో మీ వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. పెళ్లికాని యువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. పార్టనర్ షిప్ తో చేసే వ్యాపారంలో మీరు భారీగా లాభాలను గడిస్తారు. 

మిథున రాశి (Gemini): శుక్రుని సంచారం మిథునరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు మీ రాశి నుండి పదో ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. వ్యాపారవేత్తలు తమ బిజినెస్ ను విస్తరిస్తారు. ఈ సమయంలో మీ ఆదాయం రెట్టింపు అవుతుంది.

Also Read: Saturn Transit 2023: సంక్రాంతి తర్వాత శని సంచారం.. మీ ఇల్లు అంతా డబ్బుతో నిండిపోవడం ఖాయం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Read More