Home> ఆధ్యాత్మికం
Advertisement

Venus-Mercury transit 2023: బుధ, శుక్ర గ్రహాల గోచారంతో ఈ 4 రాశులకు సెప్టెంబర్ నెలంతా పట్టిందల్లా బంగారమే

Venus-Mercury transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారం, రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత, మహత్యముంటాయి. ప్రతియేటా నిర్ణీత సమయంలో ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి. అందుకే కొన్ని నెలలు కొన్ని రాశులకు కీలకంగా మారతాయి.
 

Venus-Mercury transit 2023: బుధ, శుక్ర గ్రహాల గోచారంతో ఈ 4 రాశులకు సెప్టెంబర్ నెలంతా పట్టిందల్లా బంగారమే

Venus-Mercury transit 2023: గ్రహాల రాజకుమారుడిగా భావించే బుధుడు, శుక్రగ్రహం రెండూ సెప్టెంబర్ నెలలో గోచారం చేయనున్నాయి. ఈ ప్రభావం ముఖ్యంగా 4 రాశులపై అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ఈ రెండు గ్రహాలతో పాటు ఇతర గ్రహాల గోచారం కూడా ఇదే నెలలో ఉండటం వల్ల జాతక రీత్యా సెప్టెంబర్ నెలకు ప్రాధాన్యత ఉందంటారు.

ప్రతి ఏటా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ఎక్కువగా జరుగుతుంటుంది. సెప్టెంబర్ నెలలో సన్, మార్స్, మెర్క్యూరీ, వీనస్, శాటర్న్ గ్రహాలు రాశి మారనున్నాయి. సెప్టెంబర్ నెల ప్రారంభంలోనే బుధ, శుక్ర గ్రహాల గోచారం ఉంది. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉన్నా ముఖ్యంగా 4 రాశులకు మాత్రం మహర్దశ పట్టనుంది. ఈ నాలుగు రాశులకు జాతకం మెరిసిపోనుంది. అంటే ఊహించని విధంగా అంతులేని ధనలాభం కలుగుతుంది.  కొత్త ఇళ్లు లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. 

వృషభ రాశి జాతకులకు బుధుడి గోచారం కారణంగా ఊహించనంత అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో శుభ కార్యం జరిగే అవకాశాలున్నాయి. లెక్కలేనంతగా ధనలాభం కలుగుతుంది. సెప్టెంబర్ నెలలో మీరు ఎదురుచూసే గుడ్‌న్యూస్ వింటారు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ నెలలో దేవతల కటాక్షం మీపై సదా ఉంటుంది. అందుకే ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు. 

శుక్రగ్రహం గోచారం ప్రభావం మిధున రాశి జాతకులపై చాలా బాగుంటుంది. అన్ని విషయాల్లోనూ కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. ఇచ్చిన అప్పు తిరిగి చేతికి వస్తుంది. పెండింగులో ఉన్న లేదా నిలిచిపోయిన ఏదైనా ప్రాజెక్టు పనులు పూర్తి కావచ్చు. ఆర్దిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకపోవచ్చు. అంతా అనుకూలంగా ఉంటుంది. 

వృశ్చిక రాశి జాతకులకు సెప్టెంబర్ నెల చాలా కీలకం. ఎందుకంటే ఈ జాతకులపై లక్ష్మీదేవి కటాక్షం కావల్సినంతగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తి కావడమే కాకుండా ఊహించని ధన లాభం కలుగుతుంది. ఫలితంగా ఆర్ధికంగా ఎలాంటి కష్టాలు ఎదురుకావు. డబ్బులకు లోటుండదు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్ధులుకు చాలా మంచి సమయం. ఎంత కష్టపడితే అంతగా లాభాలుంటాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. 

ఇక శుక్రుడు, బుధ గ్రహాల గోచారం ప్రభావంతో తుల రాశి జాతకులకు తిరుగుండదు. వెనుదిరిగి చూసుకోవల్సిన అవసరముండదు. వ్యాపారం లేదా ఉద్యోగం చేసేవారికి చాలా బాగంటుంది. అంతులేని ధనలాభం కలగడంతో ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. వ్యాపారులకు కొత్త కొత్త ఆర్డర్లు చేతికి వస్తాయి. ఉద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లేదా పదోన్నతి ఉంటుంది.. ఆదాయమార్గాలు పెరుగుతాయి.

Also read: Rahu Transit 2023: మరో 2 నెలలాగితే ఈ 3 రాశులకు దశ తిరిగినట్టే, ఊహించని ధనలాభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More