Home> ఆధ్యాత్మికం
Advertisement

Tulsi Vastu tips: తులసి మెుక్క చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి, భారీగా నష్టపోతారు!

Vastu tips : మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే దాని చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించండి. అవేంటో తెలుసుకుందాం. 
 

Tulsi Vastu tips: తులసి మెుక్క చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి, భారీగా నష్టపోతారు!

Vastu tips in Telugu: హిందువులు తులసి మెుక్కను చాలా పవిత్రంగా భావిస్తారు. దేవతలతో సమానంగా కొలుస్తారు. ఎందుకంటే ఈ మెుక్కలో లక్ష్మీదేవితోపాటు ఇతర దేవతలు కొలువుంటారని నమ్ముతారు. హిందువులు తమ ఇళ్లలో ప్రతిష్టించి పూజలు, ప్రదక్షిణలు చేస్తారు. తులసి మెుక్కను నిత్యం పూజించేవారిపై లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే తులసి మెుక్కకు చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అవేంటో తెలుసుకుందాం. 

తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఇవి పాటించండి..
>> తులసి మెుక్క చుట్టూ ప్రదక్షిణలు చేయాలనుకునేవారు ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. అనంతరం తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. 
>> తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసే ముందు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత తులసికి నీరు పోయాలి. 
>> తులసి మొక్క చుట్టూ తిరుగుతూ కూడా నీటిని పోయవచ్చు. మూడు సార్లు మాత్రమే ప్రదక్షిణ చేయాలి.
>> ప్రస్తుత రోజుల్లో చాలా మందికి తులసి మెుక్క పెట్టుకోవడానికే స్థలం ఉండట్లేదు. ఒకవేళ పెట్టినా దాని  చుట్టూ తిరిగేంత ప్లేస్ లేదు. అలాంటి వారు ఒకే చోట నిలబడి మూడుసార్లు ప్రదక్షిణ చేయవచ్చు. 

ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని చెప్పండి
తులసి చెట్టుకు ప్రదక్షిణ చేస్తూ నీరు పోయండి. మహాప్రసాదం జననీ, సర్వ సౌభాగ్యవర్ధిని ఆది వ్యాధి హర నిత్యం, తులసీ త్వం నమోస్తుతే. అనే మంత్రాన్ని జపించండి. దీంతో మీరు తులసి దేవి ఆశీస్సులు పొందుతారు.

Also Read: కన్యారాశిలో మూడు గ్రహాల సంయోగం.. ఈ 4 రాశుల వారిని వరించనున్న అదృష్టం... 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More