Home> ఆధ్యాత్మికం
Advertisement

Vastu Tips For Money: ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే... ఈ పువ్వును ఖజానాలో ఉంచండి!

Vastu Tips For Money: హిందువులు మోదుగ చెట్టును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మోదుగ పువ్వు ఇంట్లో ఉంటే దేనికీ లోటు ఉండదట. 
 

Vastu Tips For Money: ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే... ఈ పువ్వును ఖజానాలో ఉంచండి!

Vastu Tips For Money: వాస్తు శాస్త్రంలో డబ్బుకు సంబంధించి అనేక వాస్తు చిట్కాలు చెప్పబడ్డాయి. దీని ప్రకారం, కొన్ని మెుక్కలు లేదా పువ్వులు ఇంట్లో ఉంచడం ద్వారా వాస్తుదోషాలు తొలగిపోవడంతోపాటు డబ్బు ప్రవాహం పెరుగుతుంది. హిందువులు మోదుగ చెట్టును (Vastu Tips For Palash Tree) చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది ఒక ఎర్రని పూల చెట్టు. ఈ పువ్వులను అగ్ని పూలు లేదా పలాస పువ్వు అని అంటారు. రంగుల తయారీలో, ఆయుర్వేదంలో ఈ పలాస పువ్వును ఉపయోగిస్తారు. మోదుగ పువ్వు ప్రతి సంవత్సరం హోలీ పండుగకు ముందు పూస్తుంది. ఈ పుష్పమంటే పరమశివుడికి ఎంతో ఇష్టమట. మోదుగ పువ్వుతో పరిహారం చేస్తే మీ ఇంట్లో దేనికీ లోటు ఉండదు. 

పలాస పువ్వుతో పరిహారం..
ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే పలాసపువ్వు, కొబ్బరికాయను తెల్లటి గుడ్డలో కట్టి ఇంట్లోని ఖజానాలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహంతో ధన ప్రవాహం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది. శుక్రవారం సాయంత్రం ఈ పరిహారం చేస్తే మంచి ఫలితాలు అందుకుంటారు. తాజా పువ్వులు లేని వారు ఎండిన పువ్వులతో కూడా పరిహారం చేయవచ్చు. అంతేకాకుండా శుక్రవారం పలాస చెట్టును పూజించడం వల్ల లక్ష్మీ దేవితో సహా అనేక దేవతల ఆశీస్సులు లభిస్తాయి. ఇలా కనీసం 5 శుక్రవారాలు చేస్తే మంచిది.

Also Read: Budh Vakri 2022: అక్టోబర్ 2 వరకు తిరోగమనంలో బుధుడు.. లక్కీ, అన్ లక్కీ రాశులివే..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More