Home> ఆధ్యాత్మికం
Advertisement

Vastu Tips: ఇంట్లో ఆ ఐదు వస్తువుల్ని ఉంచితే..రాత్రికిరాత్రి బికారులవడం ఖాయం

Vastu Tips: జ్యోతిష్యశాస్త్రంలో వాస్తుశాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కొంతమంది ఎంతగా కష్టపడుతున్నా ఆశించిన ప్రయోజనాలు కలగవు. డబ్బులు కూడా ఖర్చయిపోతుంటాయి. ఈ నేపధ్యంలో వాస్తుశాస్త్రం ప్రకారం ఇళ్లు సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. 

Vastu Tips: ఇంట్లో ఆ ఐదు వస్తువుల్ని ఉంచితే..రాత్రికిరాత్రి బికారులవడం ఖాయం

Vastu Tips: జ్యోతిష్యశాస్త్రంలో వాస్తుశాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కొంతమంది ఎంతగా కష్టపడుతున్నా ఆశించిన ప్రయోజనాలు కలగవు. డబ్బులు కూడా ఖర్చయిపోతుంటాయి. ఈ నేపధ్యంలో వాస్తుశాస్త్రం ప్రకారం ఇళ్లు సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. 

బాగా సంపాదిస్తున్నా సరే..ఇంట్లో డబ్బులకు లోటు ఏర్పడుతుందంటే ఎక్కడో ఏదో తప్పు జరుగుతున్నట్టే లెక్క. వాస్తుశాస్త్రం ప్రకారం మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ఆర్ధికపరమైన ఇబ్బందుల్లో పడేస్తుంటాయి. ప్రత్యేకించి ఇంట్లో కొన్ని వస్తువుల్ని ఉంచకూడదు. ఎందుకంటే వాస్తుశాస్త్రం ప్రకారం..ఆ నిషేధిత వస్తువుల కారణంగా డబ్బులకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంటే..వెంటనే ఆ వస్తువుల్ని తీసేయండి.

ఇంట్లో ఉండకూడని 5 వస్తువులు

వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో 5 రకాల వస్తువులు పొరపాటున కూడా ఉండకూడదు. ఉంటే ఆర్ధికపరమైన సమస్యలు ఎదురౌైతాయి. తాజ్ మహల్ అందరికీ తెలుసు. ఇది ప్రేమకు చిహ్నం. కానీ వాస్తు ప్రకారం ఇంట్లో ఉంచకూడదంటారు. ఎందుకంటే తాజ్ మహల్ అనేది ముంతాజ్ బేగమ్ సమాధిపై కట్టిన కట్టడం. ఇంట్లో సమాధిని పెట్టడం వల్ల నెగెటివ్ శక్తులు ప్రసారమౌతాయి వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో మహాభారతం ఫోటో లేదా పుస్తకం ఉంచకూడదు. దీనివల్ల ఇంట్లో గొడవలు వస్తుంటాయి. డ్రాయింగ్ రూమ్ లేదా బెడ్రూమ్‌లో పొరపాటున కూడా మహాభారత్ ఫోటో ఉండకూడదు.

చాలామంది కుండిల్లో పూలు పెడుతుంటారు. కానీ అవి వాడిపోయిన తరువాత మార్చడం మర్చిపోతుంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం వాడిన పూలు అశుభానికి సూచకం. అందుకే బహమానంగా వచ్చిన పూలబొకేలను జాగ్రత్త చేసుకోవాలనుకుంటే..పూలు వాడిపోయిన తరువాత బయట పారేయండి.

ఇక ఇంట్లో ఉండకూడని మరో వస్తువు..విరిగిన విగ్రహాలు. వీటివల్ల ఇంట్లో నెగెటివ్ శక్తుల్ని ప్రసారమౌతాయి. అశుభాన్ని కలగజేస్తాయి. అందుకే ఇంట్లో ఎప్పుడూ విరిగి వస్తువుల్ని ఉంచవద్దు. ఎప్పటికప్పుడు బయట పారేస్తుండండి. ఇక మరో వస్తువు వంగిపోయిన తీగలు. చాలా ఇళ్లలో ఇవి కన్పిస్తుంటాయి. ఇంట్లో ఉండే తీగలు ఎప్పుడూ వంగిపోకుండా చూసుకోవాలి. వీటివల్ల ఇంట్లో నెగెటివ్ శక్తులు ప్రసారమౌతాయి.

Also read: Mars Transit 2022: మంగళ గ్రహం స్థానచలనం, ఆ మూడు రాశులకు ఇవాళ్టి నుంచి అంతులేని ధన సంపదలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More