Home> ఆధ్యాత్మికం
Advertisement

Vastu For Home: ఈ లోపాల కారణంగానే ఆర్థిక సమస్యలు.. జాగ్రత్తలు తప్పనిసరి..


Vastu Tips For Home: ఇంట్లో వాస్తు లోపం కారణంగానే చాలామంది తీవ్ర ఆర్థిక సమస్యల బారిన పడుతున్నారని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా దీని కారణంగా మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. కాబట్టి మీ ఇంట్లో ఇలాంటి లోపాలు ఉంటే తప్పకుండా సవరించుకోండి.

Vastu For Home: ఈ లోపాల కారణంగానే ఆర్థిక సమస్యలు.. జాగ్రత్తలు తప్పనిసరి..

Vastu Tips For Home: వాస్తు దోషం కారణంగా చాలామంది జీవితాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇంటి నిర్మాణంలో వాస్తు లోపం కారణంగా తీవ్ర ఆర్థిక సమస్యలు వస్తాయి. ఇవే కాకుండా ఇంట్లో అనుకూల శక్తి కంటే ప్రతికూల శక్తి ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంది. వాస్తు కూడా వ్యక్తుల జీవితంలో ప్రధానమైందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు కారణంగా జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు ఏంటో.. వాస్తులో ఎలాంటి మార్పులు చేయడం వల్ల ఈ సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిది:

✽ వాస్తు శాస్త్రంలో వంటగదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వంటగది సరైన స్థానంలో ఉండి గ్యాస్ స్టవ్ సరైన దశలోనే బిగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వంటగదిని మీరు తరచుగా క్లీన్ చేస్తూ ఉండాలి. లేకపోతే వాస్తులో మార్పులు వచ్చి ఆర్థిక సమస్యలకు దారి తీసే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా అనారోగ్యం సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నట్లు వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

✽ వాస్తు లోపం కారణంగా ఇంట్లో ప్రతికూల శక్తి ఎప్పుడూ సంచారం చేస్తూనే ఉంటుంది. అయితే ఇలాంటి క్రమంలో అగరబత్తిని వెలిగించడం చాలా మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. 

Also Read: Salaar Teaser: సలార్‌ టీజర్ వచ్చేసింది.. పవర్‌ఫుల్ లుక్‌లో ప్రభాస్.. గూస్‌బంప్స్ పక్కా..!  

✽ వాస్తు ప్రకారం..ఇంట్లో కిటికీలు లేదా తలుపులపై సెలెనైట్ రాయిని ఉంచడం వల్ల బయట నుంచి వచ్చే ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాయిని ఇంటి గుమ్మానికి కూడా కట్టుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

✽ ఇంట్లో ఉన్న పనికిరాని పాత వస్తువులన్నీ ప్రతికూల శక్తితో సమానం. కాబట్టి వీటిని స్టోర్ రూమ్ లో ఉంచడం కంటే పడేయడం చాలా మంచిది నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా విరిగిపోయిన వస్తువులను కూడా ఇంట్లో ఉంచుకోకూడదు.

✽ వాస్తు శాస్త్రంలో ఇంటికి ఈశాన్య దిక్కు చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ దిక్కున దేవుడు కొలువై ఉంటాడని చెప్పుకుంటారు. వాస్తు ప్రకారం.. ఈశాన్యం నుంచి అధిక బరువు ఉన్న వస్తువులను తొలగించడం చాలా మంచిది.

✽ ఇంట్లో తుప్పు పట్టిన వస్తువులను కూడా ఉంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వెంటనే ఈ వస్తువుల పై ఉన్న మురికిని తుప్పును శుభ్రం చేయడం మంచిది.

Also Read: Salaar Teaser: సలార్‌ టీజర్ వచ్చేసింది.. పవర్‌ఫుల్ లుక్‌లో ప్రభాస్.. గూస్‌బంప్స్ పక్కా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Read More