Home> ఆధ్యాత్మికం
Advertisement

Ugadi 2022: ఉగాది నాడు ముస్లిం భక్తులతో కిటకిటలాడుతున్న వేంకటేశ్వరస్వామి ఆలయం.. ఎక్కడో తెలుసా

Muslim devotees visits Venkateswara Swamy Temple. ఉగాది పండుగ వచ్చిందంటే.. కడపలో కొలువుదీరి ఉన్న ప్రసన్న లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం ముస్లిం భక్తులతో కిటకిటలాడుతుంది. అ ఆలయంలో ముస్లింలు స్వామిని దర్శించుకొని తొలి పూజలు నిర్వహిస్తారు. 

Ugadi 2022: ఉగాది నాడు ముస్లిం భక్తులతో కిటకిటలాడుతున్న వేంకటేశ్వరస్వామి ఆలయం.. ఎక్కడో తెలుసా

Tirumala Tholi Gadapa Kadapa Venkateswara Swamy Temple packed with Muslim devotees: భారత దేశంలో ఎన్నో పండగలు ఉంటాయి. అందులో కొన్ని పండుగలు సర్వమత సమ్మేళనానికి నిదర్శనంగా నిలుస్తుంటాయి. అలాంటి పండగల్లో 'ఉగాది' కూడా ఒకటి. ఉగాది పండుగ వచ్చిందంటే.. ఆ ఆలయం ముస్లిం భక్తులతో కిటకిటలాడుతుంది. అ ఆలయంలో ముస్లింలు స్వామిని దర్శించుకొని తొలి పూజలు నిర్వహిస్తారు. ఆ ఆలయం మరెక్కడో లేదు.. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఉంది. అక్కడ ముస్లింలు సర్వమత సమ్మేళనంగా పండగ జరుపుకోవడం విశేషం. 

దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు వేంకటేశ్వరస్వామిని కలియుగ దైవంగా పూజిస్తే.. కడపలో కొలువుదీరి ఉన్న ప్రసన్న లక్ష్మీవేంకటేశ్వర స్వామిని అల్లుడిగా, బీబీ నాంచారమ్మను తమ ఇంటి ఆడపడుచుగా అక్కడి ముస్లింలు భావిస్తారు. దీంతో ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలుస్తారు. అయితే అమ్మవారికీ ఘనంగా పూజలు చేసి కానుకలు సమర్పించడం ఓ సంప్రదాయంగా పాటిస్తారు ముస్లిం పెద్దలు. ఈ ఆచారం ఏళ్ల క్రితం నుంచి వస్తుంది. ఈ మహిమాన్వితమైన క్షేత్రానికి కొన్ని శతాబ్దాల చరిత్ర ఉందని, ఈ క్షేత్రాన్ని దర్శిస్తే కోరుకున్న కోరికలు తీరుతాయని అక్కడి ప్రజల నమ్ముతారు.

తిరుమలలోని శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ముందుగా కడపలోని ప్రసన్న లక్ష్మీవేంకటేశ్వరుడిని చూడాలని అంటారు. తిరుమల వరకూ వెళ్లలేని వారు.. శ్రీవారి మొక్కులు చెల్లించుకోని వారు.. ఆ ముడుపుల్ని ఈ ఆలయంలో చెల్లించినా సరిపోతుందనేది భక్తుల నమ్మకం. కడపలోని ఆలయంలోని గర్భగుడిలో స్వామి విగ్రహంతో పాటూ హనుమంతుడినీ దర్శించుకోవచ్చు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు కనీస వసతులు కల్పించారు. 

ప్రతి ఏడాది ఉగాది నాడు కడపలో ఉండే ముస్లింలు ప్రసన్న లక్ష్మీవేంకటేశ్వరుడి ఆలయానికి వచ్చి బీబీ నాంచారమ్మకూ, వేంకటేశ్వరుడికీ కానుకలు, ముడుపులు చెల్లించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. ఈరోజు ఉగాది పర్వదినం సందర్భంగా.. ఎప్పటిలానే ముస్లిం ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని కానుకలు, ముడుపులు చెలించుకున్నారు. దాంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. 

Also Read: Anushka Sharma: అనుష్క శర్మ.. టూ హాట్! ఆసక్తికర కామెంట్ చేసిన విరాట్ కోహ్లీ!!

Also Read: Tiger Nageswara Rao: రవితేజ కొత్త సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'.. లాంచ్ చేసిన చిరంజీవి...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More