Home> ఆధ్యాత్మికం
Advertisement

Grah Gochar 2024: మార్చిలో కీలక గ్రహ సంచారాలు.. ఈ 4 రాశులకు బోలెడు లాభాలు..

Planet Transit in March 2024: వచ్చే నెలలో బుధుడు, శుక్రుడు, సూర్యుడు మెుదలైన గ్రహాలు తమ రాశులను మార్చబోతున్నాయి.  దీంతో నాలుగు రాశులవారు లాభపడనున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
 

Grah Gochar 2024: మార్చిలో కీలక గ్రహ సంచారాలు.. ఈ 4 రాశులకు బోలెడు లాభాలు..

Grah Gochar 2024 in March: మార్చి నెల ప్రారంభమవ్వడానికి ఐదు రోజులు మాత్రమే ఉంది. ఈనెలలో కొన్ని పెద్ద గ్రహాలు తమ కదలికలను మార్చుకోబోతున్నాయి. బుధుడు మార్చి 07న మీనరాశిలోకి, మార్చి 12న శుక్రుడు కుంభరాశిలోకి, మార్చి 14న సూర్యభగవానుడు మీనరాశిలోకి ప్రవేశించనున్నారు. మార్చి 18న శుక్రుడు కుంభరాశిలో ఉదయించబోతున్నాడు. ఈ గ్రహాల గమనంలో మార్పు నాలుగు రాశులవారికి లాభదాయకంగా ఉండబోతుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

కర్కాటక రాశి
మార్చి నెల కర్కాటక రాశి వారికి అద్బుతంగా ఉండబోతుంది. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. వ్యాపారస్తులు ఈ సమయంలో మంచి లాభాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసే వారి కోరిక ఫలిస్తుంది. మీ ఆర్థికంగా పటిష్టమవుతారు. 
కన్యా రాశి
వచ్చే నెలలో కన్యారాశి వారు చాలా లాభాలను పొందుతారు. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. ఉద్యోగం కోసం ఎదురుచూసేవారి కోరిక నెరవేరుతుంది. ప్రమోషన్ రావడంతోపాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. కోర్టు కేసుల్లో మీరు విజయం సాధిస్తారు. 

మేష రాశి
గ్రహ గమనంలో మార్పులు మేష రాశి వారికి మేలు చేస్తాయి. ఈ సమయంలో మీరు కొన్ని శుభవార్తలు వింటారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీ జీవితంలో ఆనందం తాండవిస్తోంది. 
వృషభ రాశి
వృషభ రాశి వారికి గ్రహాల కదలికలు ప్రయోజనాన్ని చేకూరిస్తాయి. మీ పనుల్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఎంతోకాలంగా ఆగిపోయిన ప్రమోషన్ వస్తుంది. మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో ఏదైనా టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. 
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Guru Gochar 2024: రాశి మారనున్న బృహస్పతి.. ఈ 3 రాశులకు లక్కే లక్కు.. డబ్బే డబ్బు..

Also Read: Maghapurnima 2024: రేపు మాఘ పౌర్ణమి.. ఈ రోజు రాత్రి చంద్రుని వెలుగులో ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుల వర్షమే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More