Home> ఆధ్యాత్మికం
Advertisement

Navpancham Yog 2023: 30 ఏళ్ల తర్వాత 'ట్రిపుల్ నవపంచం యోగం'... ఈ 3 రాశులపై డబ్బు వర్షం..

Navpancham Yog: 30 ఏళ్ల తర్వాత శని, కేతువు మరియు కుజుడు గ్రహాల కలయిక వల్ల ట్రిపుల్ నవపంచమ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. 
 

Navpancham Yog 2023: 30 ఏళ్ల తర్వాత 'ట్రిపుల్ నవపంచం యోగం'... ఈ 3 రాశులపై డబ్బు వర్షం..

Three Navpancham Yog In Kundali: ఆస్ట్రాలజీ ప్రకారం, ఒక గ్రహం సంచరించినప్పుడల్లా.. అవి ఇతర గ్రహాలతో పొత్తులు పెట్టుకుంటాయి. దీని వల్ల శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. 30 ఏళ్ల తర్వాత కుజుడు- శని, అంగారకుడు-కేతువు, శని-కేతువు గ్రహాలు నవపంచమ యోగాలు చేస్తున్నాయి. ఈ ట్రిపుల్ నవపంచమ యోగం వల్ల కొన్ని రాశులవారు లాభపడనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

ట్రిపుల్ నవపంచమ యోగం ఈ రాశులకు వరం
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి నవపంచం యోగం శుభప్రదంగా ఉంటుంది. మీ జాతకంలో శనిదేవుడు మూడో ఇంట్లో కూర్చున్నాడు. శని నుండి తొమ్మిదవ ఇంట్లో కేతువు బలంగా ఉన్నాడు. దీంతో మీలో ధైర్యం మరియు శక్తి పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీరు ఆస్తి లేదా వాహనం కొనుగోలు  చేసే అవకాశం ఉంది. 
కుంభం
ట్రిపుల్ నవపంచం యోగం కుంభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. శని మీ రాశిలో కూర్చున్నాడు. కుజుడు శని నుండి ఐదవ స్థానంలో మరియు కేతువు అంగారకుడి నుండి ఐదవ స్థానంలో, శని కేతువు నుండి ఐదవ స్థానంలో కూర్చున్నాడు. కుంభరాశివారికి లక్ కలిసి వస్తుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. 
మిధునరాశి
మిథున రాశి వారికి నవపంచం యోగం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి త్రిభుజంలో ఈ యోగం ఏర్పడబోతోంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. డబ్బు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. జాబ్ కోసం ఎదురుచూస్తున్న వారి కల ఫలిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీ కోరికల నెరవేరుతాయి. కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం, బెట్టింగ్, లాటరీ వంటివి లాభిస్తాయి.

Also Read: Solar Eclipse 2023: ఏడాది తొలి సూర్య గ్రహణం ఎప్పుడు, ఆ 4 రాశులకు తీవ్ర కష్టాలు తప్పవా 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More