Home> ఆధ్యాత్మికం
Advertisement

Food lover zodiacs: ఫుడ్​ లవర్స్​లో ఈ రాశుల వారే అధికమట తెలుసా?

Food lover zodiacs: జ్యోతిష్య శాస్త్రంలో ఏ రాశి వారికి ఎలాంటి అలవాట్లు ఉంటాయో తెలుస్తుంటాయి. అలానే వివిధ రాశుల వారి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి? ఏ రాశి వారు ఫుడీగా ఉంటారు అనే వివరాలు మీకోసం.

Food lover zodiacs: ఫుడ్​ లవర్స్​లో ఈ రాశుల వారే అధికమట తెలుసా?

Food lover zodiacs: అహారం అనేది మానవజాతి మనుగడకు చాలా కీలకం. ఎవరు ఎన్ని పనులు చేసిన అంతా బుక్కెడు కూటికోసమే. అయితే కొంత మంది మాత్రం ఆహారాన్ని అవసరంగా తింటారు. మరికొందరేమో.. తినడం కోసమే తాము బతుకుతున్నట్లు తింటుంటారు. అయితే ఏది ఏమైనా.. ఆహారం మాత్రం చాలా ముఖ్యమనేది మాత్రం అక్షర సత్యం.

అయితే అందరి ఆహారపు అలవాట్లు ఒకే విధంగా ఉండవు. కొందరు రకరకాల వంటలను ఆస్వాదిస్తూ తింటారు. వాళ్లను వాళ్లు ఫుడీస్​గా చెప్పుకుంటారు కూడా. కొంత మంది మాత్రం మితంగా ఎంపిక చేసిన పదార్థాలను మాత్రమే తింటారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారికి తినడం అంటే బాగా ఇష్టమట. ఒక వేళ మీరు బాగా వంటలు చేస్తుంటే.. మీరు వండిన వంటను ఇష్టంగా తినేవారు ఎవరో తెలుసుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఏ రాశుల వారు ఆహారాన్ని ఇష్టంగా తింటారో (ఫుడీస్​) తెలసుకుందామా!

వృషభం

ఈ రాశుల వారు ఆహారంలో ఆనందాన్ని వెతుక్కుంటారు. ఒక్కసారి ఏదైనా తమకు నచ్చితే వాటికి ఆకర్షింతులవుతారు. ఏదానా ఆహారం తమకు రుచికరంగా అనిపిస్తే.. దానిని ఇక ఎప్పటికీ వదలరు.

అంతే కాదండోయ్.. ఆహారం బాగోలేకుంటే నిర్మొహమాటంగా చెప్పడం కూడా వీరి నైజం. ఇక రెస్టారెట్లు, హోటళ్లు సహా ఇతర ప్రాంతాల్లో ఎప్పుడైనా ఫుడ్​ తినేటప్పుడు ఆహారం బాలేదని అక్కడ నుంచి వెంటనే వెళ్లిపోతారట. వీరు ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినేందుకే మొదటి ప్రాధాన్యతనిస్తారు.

ధనుస్సు రాశి

ఈ రాశి వారు ఎక్కువగా విదేశీ వంటకాలకు ఆకర్షితులవుతారు. నూడుల్స్​, ఫ్రైడ్​ రైస్​, బర్గర్లు, పిజ్జాల వంటివి ఎక్కువగా తినేందుకు ఇష్టపడతారు.

అంతేకాకుండా ఈ రాశి వారు కొత్త రకం వంటకాలను రుచి చూసేందుకు ఎల్లప్పుడు ముందుంటారు. ఇంకా చెప్పాలంటే.. ఈ టైమ్​లో ఇదే వంటకాలు తినాలనే ఆలోచనా ధోరణి ఈ రాశివారిక ఉండదు. ఏ సమయంలోనైనా ఏ ఆహారమైన తినేందుకు ఈ రాశి వారు ఇష్టపడపతారు.

తులా రాశి

ఈ రాశి వారు కూడా ఇష్టమైన ఆహారాన్ని తినేందుకు మొదటి ప్రాధాన్యతనిస్తారు. అయితే ఈ రాశివారు ఏ సమయంలో అదే ఆహారం తినేందుకు మొగ్గు చూపుతారు. అంటే ఉదయం బ్రేక్​ఫాస్ట్​, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలం వాటిల్లో తమకు ఇష్టమైన వాటిని తింటారు. అయితే అన్ని సార్లు ఆహారం విషయంలో బ్యాలెన్స్​ చేయలేరు.

మీన రాశి..

ఈ రాశి వారి ఎక్కువగా జంక్​ ఫుడ్​ ఇష్టపడతారు. అయితే కొత్త వంటకాలను ట్రై చేసేందుకు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు. అయితే ఇదే వంటను తినాని వీరు అనుకోరు. ఉడకబెట్టిన ఆహారాన్ని మినహా.. ఇతర ఆహార పదార్థాలను ఇష్టంగా తింటుంటారు.

అయితే ఈ రాశి వారు ఆహారాన్ని తినడం ఏదో పరిశోధనకోసమే లేదా రివ్యూలకోసమే తినరు. కేవలం వారి సంతోషం కోసం మాత్రమే ఫుడీగా ఉంటారు.
ఇక ఈ రాశి వారి గురించి ఓ క్రేజీ విషయమేమిటంటే.. డిప్రెషన్​లో ఉన్నా, ఏదైనా బాధలో ఉన్నా వీరు ఎక్కువగా ఆహారం తింటారు.

Also read: TTD Aarjitha Seva Tickets: మార్చ్ 20 నుంచి ఆన్‌లైన్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు

Also read: Dreams Astrology: ఆ కలలకు శని దేవుడితో సంబంధం.. అలా వస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More