Home> ఆధ్యాత్మికం
Advertisement

Surya Shukra Yuti 2022: సింహరాశిలో శుక్ర-సూర్య సంయోగం.. ఈ రాశులకు అపారమైన ప్రయోజనం!

Venus-Sun Conjunction: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. ఇది నాలుగు రాశుల వారికి ప్రయోజనకరంగా ఉండనుంది. 
 

Surya Shukra Yuti 2022: సింహరాశిలో శుక్ర-సూర్య సంయోగం.. ఈ రాశులకు అపారమైన ప్రయోజనం!

Venus-Sun Conjunction 2022: ప్రతి నెలా కొన్ని గ్రహాలు తమ రాశిని మార్చుకుంటాయి. వీటి ప్రభావం మెుత్తం 12 రాశుల ప్రజల జీవితాలపై ఉంటుంది. ఆగస్టు చివరి రోజున అంటే ఆగస్టు 31న శుక్రుడు తన రాశిని మార్చి... సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే ఆ రాశిలో గ్రహాల రాజు సూర్యుడు ఉన్నాడు. సెప్టెంబరు 17 వరకు సూర్యభగవానుడు అక్కడే ఉండనున్నాడు. సింహరాశిలో సూర్య, శుక్రల కలయిక (Surya Shukra Yuti 2022) ప్రజల జీవితాలపై పెను ప్రభావం చూపుతుంది. ఈ శుక్ర-సూర్య సంయోగం సెప్టెంబర్ 17 వరకు ఉంటుంది. ఆ తర్వాత సూర్యుడు సింహరాశిని వదలి కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. 

ఈ రాశుల వారికి శుభప్రదం
కర్కాటక రాశి (Cancer) - జ్యోతిషశాస్త్రపరంగా, శుక్రుడు మరియు సూర్యుని కలయిక ఈ రాశికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. చదువుకునే పిల్లలకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.

కుంభం (Aquairus) - శుక్రుడు మరియు సూర్యుని కలయిక ఈ రాశికి మంచి ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది. భారీగా సంపాదిస్తారు.  పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. ఇతర మార్గాల ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. 

వృషభం (Taurus)- ఈ కలయిక మీ లైఫ్ పై సానుకూల ప్రభావం చూపుతుంది. కుటుంబ జీవితం మెరుగుపడుతుంది. ఉన్నత విద్యకు అభ్యసించేవారు చాలా ప్రయోజనాలను పొందుతారు. మొత్తం మీద సూర్యుడు, శుక్రుడు కలయిక ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

మిథునరాశి (Gemini)- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రాశి వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఈ సమయంలో భారీగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. మీరు పనిచేసే చోట ప్రశంసించబడతారు.  

Also Read: Grah Gochar 2022: సెప్టెంబరులో ఈ 3 గ్రహాల సంచారం... ఈ రాశులకు భారీ లాభం! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More