Home> ఆధ్యాత్మికం
Advertisement

Surya-Shukra Yuti 2022: సూర్యుడు-శుక్రుడు కలయిక... ఆగస్టు 31 నుంచి ఈ రాశులకు పండగే పండుగ..!

Surya-Shukra Yuti 2022: ఆగస్టు 31న సింహరాశిలో  సూర్యుడు, శుక్రుడు కలవబోతున్నారు. వీటి కలయిక కొన్ని రాశులవారికి బంపర్ ప్రయోజనాలను ఇస్తుంది. 
 

Surya-Shukra Yuti 2022: సూర్యుడు-శుక్రుడు కలయిక... ఆగస్టు 31 నుంచి ఈ రాశులకు పండగే పండుగ..!

Surya-Shukra Yuti 2022: శుక్రుడు మరో వారం రోజుల్లో తన రాశిని మార్చబోతున్నాడు. ఆగస్టు 31 శుక్రుడు సింహరాశిలో సంచరించబోతున్నాడు. ఇప్పటికే సింహరాశిలో సూర్యుడు ఉన్నాడు. విజయాన్ని, విశ్వాసాన్ని ఇచ్చే గ్రహం సూర్యుడు అయితే, శుక్రుడు ఆనందం మరియు అందం, విలాసవంతమైన జీవితాన్ని ఇస్తాడు. సింహరాశిలో సూర్యుడు, శుక్రుడు కలయిక (Sun-venus Conjunction 2022) కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. వీటి సంయోగం వల్ల ఏరాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.

వృషభం (Taurus): శుక్రుడు, సూర్యుని కలయిక వృషభ రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. ఈ రాశివారి లైఫ్ ఒక్కసారిగా మారిపోతుంది. ఇంటి కోసం చాలా షాపింగ్ చేస్తారు. మీకు కొత్త జాబ్ వస్తుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. 

సింహం (Leo): శుక్రుడు మరియు సూర్యుని కలయిక ఈ రాశిలోనే జరుగుతుంది. కాబట్టి ఈ రాశివారు శుభఫలితాలను పొందనున్నారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఈ సమయం వ్యాపారులకు చాలా మంచిది, వారు పెద్ద పెద్ద ఆర్డర్లు పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.  

తుల (Libra): తుల రాశి వారికి సూర్యుడు, శుక్రుడు కలయిక చాలా మేలు చేస్తుంది. ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనేక రకాలుగా డబ్బు సంపాదిస్తారు. పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ జీవితం బాగుంటుంది. ఒంటరి వ్యక్తులు పెళ్లి చేసుకోనే అవకాశం ఉంది.

Also Read: Surya-Shukra Yuti 2022: సింహరాశిలో సూర్య-శుక్ర సంయోగం.. ఈ 3 రాశులకు అదృష్టం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More