Home> ఆధ్యాత్మికం
Advertisement

Surya Grahan 2024: ఏప్రిల్ 08న మెుదటి సూర్యగ్రహణం.. ఈ 4 రాశులకు కష్టకాలం..

Solar Eclipse 2024: వచ్చే నెల 08న తొలి సూర్యగ్రహణం సంభవించబోతుంది. ఇది 12 రాశులవారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ గ్రహణం నాలుగు రాశులవారిని ఇబ్బందులకు గురిచేయనుంది.
 

Surya Grahan 2024: ఏప్రిల్ 08న మెుదటి సూర్యగ్రహణం.. ఈ 4 రాశులకు కష్టకాలం..

First Surya Grahan 2024 effect on Zodiac Signs: ఈ ఏడాది మెుదటి సూర్యగ్రహణం చైత్ర అమావాస్య నాడు ఏర్పడబోతోంది. దేవీ నవరాత్రులకు ఒక రోజు ముందు అంటే ఏప్రిల్ 08న ఈ గ్రహణం సంభవించబోతుంది. సాధారణంగా గ్రహణాలు కొన్నిసార్లు మంచి ఫలితాలను, మరికొన్ని సార్లు అశుభ ఫలితాలను ఇస్తుంది. ఈసారి జరగబోయే సూర్యగ్రహణ సమయంలో 4 రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దురదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 

కన్య రాశి 
సూర్యగ్రహణం ప్రభావం వల్ల కన్యారాశి వారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. మీ బిజినెస్ పడిపోతుంది. మీరు కోరుకున్న జాబ్ రాదు. దాంపత్య జీవితంలో భార్యభర్తల మధ్య మనస్పర్థలు పెరుగుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కదు. 
కుంభ రాశి
తొలి సూర్యగ్రహణం కుంభ రాశి వారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఆఫీసులో సహచరులతో గొడవలు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉండదు. మీ కోరికలు నెరవేరవు. మిమ్మల్ని పేదరికం వెంటాడుతోంది. డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు కేర్ పుల్ గా ఉండండి, లేదంటే భారీగా నష్టపోయే అవకాశం ఉంది. 
మేష రాశి
ఈసారి సంభవించబోయే తొలి సూర్యగ్రహణం మేషరాశి వారి జీవితాల్లో పెను మార్పులు తీసుకురాబోతుంది. వ్యాపారులు భారీగా నష్టాలను చవిచూస్తారు. మీ ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారుతుంది. మీరు కెరీర్ కు సంబంధించిన సమస్యలను ఎదుర్కోంటారు. 

Also Read: Surya Grahan 2024: ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఎప్పుడు, ఎక్కడ కనిపించబోతుందో తెలుసా?

వృశ్చిక రాశి 
మెుదటి సూర్యగ్రహణం ఈ రాశి వారికి చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. మీ వైవాహిక జీవితంలో లేనిపోని సమస్యలు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తలెత్తుతాయి. మీరు అప్పుల సుడి గుండంలో ఇరక్కుపోతారు. ప్రేమికుల మధ్య మనస్పర్థలు పెరుగుతాయి. 
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Budh Gochar 2024: మేషరాశిలో అరుదైన రాజయోగం.. వచ్చే 10 రోజుల్లో వీరు కోటీశ్వరులవ్వడం ఖాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More