Home> ఆధ్యాత్మికం
Advertisement

Surya Gochar 2023: మిథునంలో సూర్య సంచారం.. ఈ రోజు నుండి ఈ 4 రాశులకు డబ్బే డబ్బు!

Sun Transit 2023: ఇవాళ సాయంత్రం సూర్యభగవానుడు మిథునరాశి ప్రవేశం చేయనున్నాడు. ఆదిత్యుడి రాశి మార్పు నాలుగు రాశులవారికి ఊహించని ప్రయోజనాలను ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందా..
 

Surya Gochar 2023: మిథునంలో సూర్య సంచారం.. ఈ రోజు నుండి ఈ 4 రాశులకు డబ్బే డబ్బు!

Surya Gochar 2023 in Mithun Rashi Today: విజయం, ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసానికి కారకుడిగా సూర్యభగవానుడిని భావిస్తారు. జూన్ 15న ఆదిత్యుడు మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. అదే రాశిలో జూలై 16 వరకు ఉంటాడు. మిథునరాశిలో సూర్యుడి సంచారం మెుత్తం 12 రాశులవారి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. భానుడి సంచారం కొన్ని రాశులవారికి శుభఫలితాలను ఇవ్వనుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 

సూర్య సంచారం ఈ రాశులకు అదృష్టం

వృషభం:

సూర్యుని సంచారం వృషభ రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇవ్వనుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ అప్పును తిరిగి చెల్లిస్తారు. మీ ఆదాయం పెరుగుతుంది. మీకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. 

మిథునం:

ఇదే రాశిలో సూర్యుడి సంచారం జరగనుంది. దీంతో మిథునరాశి వారు మంచి లాభాలను పొందనున్నారు. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. మీ కోరికలు నెరవేరుతాయి. మీ ఆర్థికంగా వృద్ధి చెందుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ లవ్ లైవ్ బాగుంటుంది. 

Also Read: నేటి నుండి మూడు రోజులపాటు ఈరాశుల ఇళ్లపై డబ్బు వర్షం... మీరున్నారా?

కన్య:

సూర్యుని సంచారం కన్యారాశి వారికి ఉద్యోగ, వ్యాపారాలలో లాభాలను ఇస్తుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మెుత్తానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 

కుంభం:

సూర్యుని సంచారం కుంభ రాశి వారికి అపారమైన ధనాన్ని ఇస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీ ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు కెరీర్ కు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీ ప్రేమ లేదా వైవాహిక జీవితం బాగుంటుంది. 

Also Read: Surya Gochar 2023: బుధుడి రాశిలో సూర్యుడి ప్రవేశం.. ఈ 4 రాశులవారు జాగ్రత్త..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Read More