Home> ఆధ్యాత్మికం
Advertisement

Surya Gochar 2022: నవంబర్ 16న మరోసారి సూర్య గ్రహ సంచారం.. ఈ రాశువారికి విపరీతమైన డబ్బే..డబ్బు..

Surya Gochar In November 2022: అన్ని గ్రహాలు ఏదో ఒక క్రమంలో తప్పకుండా సంచారం చేస్తాయి. అయితే వచ్చే వారంలో సూర్య గ్రహం సంచారం చేయబోతోందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల నాలుగు రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరే అవకాశాలున్నాయి.

Surya Gochar 2022: నవంబర్ 16న మరోసారి సూర్య గ్రహ సంచారం.. ఈ రాశువారికి విపరీతమైన డబ్బే..డబ్బు..

Surya Gochar In November 2022: సూర్య గ్రహాన్ని గ్రహాలకు రారాజుగా పిలుస్తారు. నిర్దిష్ట సమయంలో ఏ గ్రహమైన తమ రాశిని వదిలి ఇతర రాశిలోకి తిరోగమనం చెందుతుంది. అయితే దీని వల్ల కలిగే ప్రభావం 12 రాశులపై పడే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. నవంబర్ 16న మరోసారి సూర్యుడు ఇతర రాశిలోకి ప్రవేశించే అవకాశాలున్నాయి. ఈ సారి సూర్యుడు వృశ్చికరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో పలు రాశులవారు చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
మకరరాశి:

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం..ఈ రాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో మకర రాశివారికి కుటుంబ మద్దతు లభిస్తుంది. అంతేకాకుండా కుటుంబంతో సమయం గడుపుతారని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ తిరోగమనం వల్ల పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు పొందే అవకాశాలున్నాయి. కెరీర్‌లో కొత్త మార్పులు పొందే అవకాశాలున్నాయి. వ్యాపార, ఉద్యోగాలల్లో కూడా విశేష లాభాలు పొందుతారని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి సూర్యుడు అధిపతిగా పదవ స్థానంలో ఉండబోతున్నాడు. దీంతో ఈ రాశివారు చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. వృశ్చిక రాశి వారు జీవితంలో సంతోషాన్ని, శుభ ఫలితాలను పొందే ఛాన్స్‌ ఉంది. అంతేకాకుండా సమాజంలో వీరిపై గౌరవం పెరుగుతుంది.  రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ఈ క్రమంలో మంచి ప్రయోజనాలు పొందుతారు. అన్ని పనుల్లో విజయాలు సాధిస్తారు.

కన్య రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..సూర్యుడు ఈ రాశిలో మూడవ స్థానంలో సంచరించనున్నాడు.  సూర్య గ్రహం సంచారం చేయడం వల్ల వైవాహిక జీవితంలో మార్పులు వచ్చ..ఈ క్రమంలో ఆనందం పొందే అవకాశాలున్నాయి. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది.

మిధునరాశి:
సూర్య రాశి సంచారం వల్ల మిధునరాశి వారికి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది. వ్యాపారాలలో భారీ లాభాలు పొందే అవకాశాలున్నాయి. ఈ కాలంలో పెట్టుబడి పెట్టడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో పలు జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది.

Also Read: Amazon Smart tv offers: మీ ఇంటిని హోమ్ థియేటర్‌గా మార్చే స్మార్ట్‌టీవీ కేవలం 9 వేలే

Also Read: Amazon Smart tv offers: మీ ఇంటిని హోమ్ థియేటర్‌గా మార్చే స్మార్ట్‌టీవీ కేవలం 9 వేలే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More