Home> ఆధ్యాత్మికం
Advertisement

Sun Gochar 2022: నెల రోజులపాటు వృశ్చికరాశిలో సూర్యభగవానుడు... ఈ 3 రాశులవారికి డబ్బుతోపాటు కీర్తి ప్రతిష్టలు పెరగడం ఖాయం..

Sun Gochar 2022: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, సూర్య దేవుడు వృశ్చికరాశిలోకి ప్రవేశించాడు. సూర్య భగవానుని ఈ సంచారం 3 రాశుల వారికి అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది. 

Sun Gochar 2022: నెల రోజులపాటు వృశ్చికరాశిలో సూర్యభగవానుడు... ఈ 3 రాశులవారికి డబ్బుతోపాటు కీర్తి ప్రతిష్టలు పెరగడం ఖాయం..

Sun Gochar In Scorpio 2022: ఆస్ట్రాలజీలో సూర్యభగవానుడిని గ్రహాల రాజు అంటారు. నెలకొకసారి సూర్యదేవుడు తన రాశిని మారుస్తాడు. సూర్యుడి రాశి మార్పునే మనం సంక్రాంతి అంటాం. సూర్యుడి రాశి మార్పు అన్ని రాశులవారినీ ప్రభావితం చేస్తుంది. నిన్న అంటే నవంబరు 16న సూర్యభగవానుడు వృశ్చికరాశిలో ప్రవేశించాడు. అదే రాశిలో డిసెంబరు 16 వరకు ఉండనున్నాడు. వృశ్చికరాశికి అధిపతి సూర్యభగవానుడు. పైగా సూర్యుడు, అంగారకుడు మిత్రులు. కుజుడి రాశిలో సూర్య సంచారం వల్ల మూడు రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.

సూర్య సంచారం ఈ రాశులకు వరం

సింహం (Leo): సూర్య భగవానుడి సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. సూర్యగ్రహం మీ రాశి నుండి నాల్గవ ఇంట్లో సంచరిస్తుంది. వృశ్చికరాశిలో సూర్యుడి ప్రవేశం మీరు సంపదతోపాటు ఆనందాన్ని పొందుతారు. ఈ సమయంలో మీరు కొత్త ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా వ్యాపారులు పెద్ద పెద్ద ఆర్డర్లను పొందుతారు. మీరు పూర్వీకుల ఆస్తి నుండి లాభం పొందుతారు. అయితే ఈ సమయంలో మీరు మీ  తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి.

వృశ్చికం (Scorpio): సూర్య భగవానుడి సంచారం మీకు లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో లగ్నస్థిలో సూర్యుడు సంచరించనున్నాడు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి సపోర్టు పొందుతారు. మీకు వివాహ ప్రతిపాదన రావచ్చు. మీ పని మరియు వ్యాపారంలో విజయం సాధిస్తారు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది.

వృషభం (Taurus): సూర్యభగవానుడి రాశి మార్పు ఆర్థికంగా మీకు శుభప్రదం అవుతుంది. ఎందుకంటే సూర్యభగవానుడు మీ రాశి నుండి ఏడవ ఇంటిలో సంచరించాడు. సూర్య సంచారం వల్ల మీరు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది. ఆఫీసులో మీ సహచరుల మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో మీ ఇంట్లో ఏదైనా మతపరమైన లేదా శుభ కార్యక్రమమైనా జరగవచ్చు.

Also Read: Jupiter Transit 2022: నవంబర్ 24న అరుదైన యోగం సృష్టిస్తున్న గురుడు.. ఈ 3 రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్... 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

 

Read More