Home> ఆధ్యాత్మికం
Advertisement

Shani Vakri 2023: 2 సూపర్ రాజయోగాలు చేస్తున్న తిరోగమన శని.. ఈ రాశులపై 4 నెలలపాటు డబ్బు వర్షం..

Shani Vakri 2023:  శని తిరోగమన కదలిక వల్ల రెండు సూపర్ రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. ఆస్ట్రాలజీలో వీటిని శుభప్రదంగా భావిస్తారు. ఈ యోగాలు ఏ రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం. 
 

Shani Vakri 2023: 2 సూపర్ రాజయోగాలు చేస్తున్న తిరోగమన శని.. ఈ రాశులపై 4 నెలలపాటు డబ్బు వర్షం..

Saturn Retrograde 2023: మరో వారం రోజుల్లో అంటే జూన్ 17న శనిదేవుడు తిరోగమనం చేయబోతున్నాడు. ఇతడు అక్టోబరు 17 వరకు అదే స్థితిలో ఉంటాడు. శనిదేవుడు తిరోగమనంలో ఉన్నప్పుడు అతని శక్తి తగ్గిపోతుంది. అందుకే ఈ సమయంలో ప్రజలు చాలా ఓపికగా ఉండాలి. 

అయితే ఈ సారి శని వ్యతిరేక దిశలో కదులుతున్నప్పుడు రెండు సూపర్ యోగాలు ఏర్పడుతున్నాయి. సెప్టెంబర్ 11న ఒకే రాశిలో శని, గురు, రాహువు కలయిక వల్ల తొలి రాజయోగం ఏర్పడుతుంది. అదే విధంగా కుజుడు, శని, రాహువుల సంయోగం వల్ల సెప్టెంబరు 26న మరో యోగం సంభవించబోతుంది. ఆస్ట్రాలజీలో ఈ సూపర్ రాజయోగాలను శుభప్రదంగా భావిస్తారు. దీని ప్రభావంతో నాలుగు రాశులవారు నాలుగు నెలలపాటు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేయనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.  

సింహ రాశి
మీకు లక్కు వెన్నంటే ఉంంటుంది. మీరు ఈ సమయంలో విలువైనది కొనుగోలు చేస్తారు. జాబ్ చేస్తున్న వారికి ఇంక్రిమెంట్ తో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు తమ బిజినెస్ ను విస్తరిస్తారు. మీరు కొత్త కొత్త రంగాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. 
వృషభం
రెండు సూపర్ రాజయోగాలు వల్ల మీ జీవితంలో సంతోషం వెల్లివిరిస్తుంది. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. మీరు లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. మీకు కుటుంబ సభ్యుల సపోర్టు లభిస్తుంది. 
మిధునరాశి
మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు మీ లక్ష్యాన్ని సాధిస్తారు. మీరు ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలను గడిస్తారు. మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. 

Also Read: Yogini Ekadashi 2023: జూన్ 14 నుండి ఈ 3 రాశులకు మహార్దశ.. ఇందులో మీరున్నారా?

మేషరాశి
శనిదేవుడు మేషరాశి వారికి మంచి లాభాలను  ఇస్తాడు. మీకు ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారులు పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకునే అవకాశం ఉంది. ఉద్యోగాలు మారాలని ఆలోచిస్తున్న వ్యక్తులు ఇతర కంపెనీల నుండి ఆఫర్ లెటర్లను పొందే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. 

Also Read: Surya Gochar 2023: మరో 5 రోజుల్లో కీలక పరిణామం.. ఈ రాశులకు నెల రోజులపాటు డబ్బే డబ్బు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More