Home> ఆధ్యాత్మికం
Advertisement

Sun Transit 2023: మరికొన్ని రోజుల్లో కుంభంలోకి సూర్యభగవానుడు... ఈ రాశులకు జాక్ పాట్ ఖాయం..

Sun Transit 2023: శనిదేవుడు సొంత రాశి అయిన కుంభరాశిలో సూర్యభగవానుడు సంచరించనున్నాడు. ఇది మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉండనుంది. 
 

Sun Transit 2023: మరికొన్ని రోజుల్లో కుంభంలోకి సూర్యభగవానుడు... ఈ రాశులకు జాక్ పాట్ ఖాయం..

Sun Transit In Kumbh: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా రాశిచక్రాన్ని మారుస్తాయి. గ్రహాల గమనంలో మార్పు ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపిస్తుంది. ఫిబ్రవరి 13న సూర్యదేవుడు కుంభరాశిలో గోచరిస్తున్నాడు. కుంభరాశిలో సూర్య సంచారం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.

మేష రాశిచక్రం (Aries)
సూర్యభగవానుని సంచారం మేషరాశివారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యభగవానుడు మీ రాశి నుండి 11వ ఇంట్లోకి సంచరిస్తాడు. దీంతో మీ ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. వివిధ వనరులు ద్వారా మీకు డబ్బు సమకూరుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. జీవితంలో సుఖాలు పెరుగుతాయి. మీరు డబ్బును ఆదా చేస్తారు. 

మకర రాశిచక్రం (Capricorn)
సూర్య గ్రహం యొక్క సంచారం ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యభగవానుడు మీ జాతకంలో రెండో ఇంట్లో సంచరిస్తాడు. ఈ సమయంలో మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక నెరవేరుతుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. 

సింహ రాశి(Leo)
సూర్యుని రాశి మార్పు మీకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యదేవుడు మీ జాతకంలోని ఏడో ఇంట్లో ప్రయాణిస్తాడు. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో మంచి లాభాలను గడిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద డీల్స్ ను కుదుర్చుకుంటారు. 

Also read: Planet Transit 2023: ఫిబ్రవరి నెలలో గ్రహాల గోచారం.. ఈ 4 రాశుల వారికి మంచి రోజులు మెుదలు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More