Home> ఆధ్యాత్మికం
Advertisement

Surya Gochar 2022: సెప్టెంబర్ 17 నుండి ఈ 3 రాశులవారి అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుంది..!

Surya Gochar 2022: గ్రహాల రాజు సూర్యభగవానుడు తన సొంత రాశి అయిన సింహరాశి నుండి కన్యారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. కన్యారాశిలో సూర్య సంచారం నెల రోజులపాటు ఈ రాశులవారికి అపారమైన సంపదను ఇవ్వనున్నారు. 
 

Surya Gochar 2022: సెప్టెంబర్ 17 నుండి ఈ 3 రాశులవారి అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుంది..!

Surya Rashi Parivartan 2022: ఆస్ట్రాలజీలో సూర్యుడి రాశి మార్పు చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. గ్రహాలకు రాజు అయిన సూర్యుడు ఆత్మ, తండ్రి మరియు ధైర్యానికి కారకుడు. సెప్టెంబర్ 17న సూర్యభగవానుడు సింహరాశిని వదిలి కన్యారాశిలోకి (Sun Transit in Virgo 2022) ప్రవేశిస్తాడు. కన్యారాశిలో సూర్యుని రాకతో అనేక రాశుల అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుంది. 

ఈ 3 రాశులవారికి శుభప్రదం
సింహ రాశి (Leo)- కన్యారాశిలో సూర్యుని రాక వల్ల ఈ రాశివారికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ రాశివారు వృత్తి, వ్యాపారాలలో విజయం సాధిస్తారు. సూర్యభగవానుడు ఈ రాశి యెుక్క రెండో ఇంటిలో సంచరిస్తాడు. దాని ప్రభావంతో ఈ రాశివారు భారీగా డబ్బును సంపాదిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. 

వృశ్చిక రాశి (Scorpio)- కన్యారాశిలో సూర్యుడు సంచరించడం వల్ల ఈ రాశివారు శుభవార్తలు వింటారు.  సూర్యుడి రాశి మార్పు కారణంగా ఈ రాశివారి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం. సూర్యుడు ఈ రాశి యెుక్క  11వ ఇంట్లో సంచరిస్తాడు. 

ధనుస్సు (Sagittarius)- సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించడం ధనుస్సు రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఉద్యోగులు ట్రాన్స్ ఫర్ అయ్యే అవకాశం ఉంది. సూర్యుడు ఈ రాశి యెుక్క పదో ఇంట్లో సంచరించబోతున్నాడు. కొత్త జాబ్ ను పొందే అవకాశం ఉంది. 

Also Read: Sun Venus Conjunction 2022: సింహరాశిలో సూర్య, శుక్రల కలయిక.. ఈ రాశులకు కష్టాలే ఇక..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More