Home> ఆధ్యాత్మికం
Advertisement

Surya Gochar 2022: వృశ్చికరాశిలో సూర్య సంచారం... ఈ రాశులవారికి అపారమైన ప్రయోజనం..

Surya Gochar 2022: నవంబరులో సూర్యభగవానుడు వృశ్చికరాశిలో సంచరించబోతున్నాడు. దీంతో కొన్ని రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు. 
 

Surya Gochar 2022: వృశ్చికరాశిలో సూర్య సంచారం... ఈ రాశులవారికి అపారమైన ప్రయోజనం..

Surya Gochar 2022: జ్యోతిష్యశాస్త్రంలో సూర్యదేవుడి రాశి మార్పు చాలా ముఖ్యమైనది. సూర్యుడి సంచారం ప్రతి ఒక్కరిపై పెను ప్రభావం చూపుతుంది. గ్రహాల రాజు సూర్యభగవానుడు నవంబరులో తన రాశిని మార్చనున్నాడు. నవంబర్ 16 సాయంత్రం 6.58 నిమిషాలకు తులరాశిని విడిచిపెట్టి వృశ్చికరాశిలోకి (Surya Gochar 2022) ప్రవేశిస్తాడు. సూర్యుడి ఎవరి జాతకంలో శుభస్థానంలో ఉంటాడో ఆ వ్యక్తికి దేనికీ లోటు ఉండదు. సూర్యభగవానుడికి నీటితో అర్ఘ్యం ఇస్తే చాలు వెంటనే ప్రత్యక్షమై మీ కోరికలను తీరుస్తాడు. అలాంటి సూర్యదేవుడి సంచారం ఏ రాశివారికి కలిసి రానుందో తెలుసుకుందాం. 

సూర్య సంచారం ఈ రాశులకు శుభప్రదం
మేషరాశి (Aries): మేష రాశి యెుక్క ఐదవ మరియు ఎనిమిదవ ఇంటికి సూర్యుడు అధిపతి. దీంతో ఈ రాశివారా కెరీర్ లో పురోగతిని పొందుతారు. ఆరోగ్య సమస్యలు ఉండవు. లాభాలు మెండుగా ఉంటాయి. 
వృషభం (Taurus): ఈ రాశి యెుక్క ఏడవ మరియు నాల్గవ ఇంటికి అధిపతి సూర్యభగవానుడు. ఈసమయంలో వ్యాపారాలు బాగా లాభపడతారు. ఉద్యోగులకు కూడా ఈ సమయం బాగానే ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోండి.  
మిధునరాశి (Gemini): ఈ రాశి వారికి సూర్యభగవానుడు మూడవ మరియు ఆరవ గృహాలకు అధిపతి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసేవారికి బంపర్ ప్రయోజనాలు ఉంటాయి. 
మకరరాశి (Capricorn): ఈ రాశి వారికి సంపద పెరుగుతుంది. కెరీర్, వ్యాపారంలో అపారమైన ప్రయోజనాలు ఉంటాయి. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది.
వృశ్చిక రాశి (Scorpio): ఈ రాశి వారికి పదవ ఇంటికి అధిపతి సూర్యుడు. వ్యాపారాలు చేసే వారికి భారీగా లాభాలు ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. 
తులారాశి (Libra): తుల రాశి యెుక్క రెండవ మరియు 11వ ఇంటికి సూర్యభగవానుడు అధిపతి. దీంతో ఈ రాశివారు ధన లాభాన్ని పొందుతారు. అంతే కాకుండా భారీగా పొదుపు చేస్తారు. 

Also Read: Budhaditya Yoga: దీపావళి తర్వాత బుధాదిత్య యోగం.. ఈ 3 రాశులవారి కెరీర్ అద్భుతం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.        

Android Link - https://bit.ly/3P3R74U 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More