Home> ఆధ్యాత్మికం
Advertisement

Surya Gochar 2022: అక్టోబరు 17న తులరాశిలోకి సూర్యుడు... నెల రోజులపాటు ఈరాశులవారు జాగ్రత్త..

Sun Transit 2022: అక్టోబరు 17వ తేదీ సోమవారం నుండి దాదాపు ఒక నెలపాటు సూర్యుడు తులారాశిలో ఉంటాడు. సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించిన తర్వాత నెల రోజులపాటు ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. 
 

Surya Gochar 2022: అక్టోబరు 17న తులరాశిలోకి సూర్యుడు... నెల రోజులపాటు ఈరాశులవారు జాగ్రత్త..

Sun Transit in Libra 2022: సూర్యుడు తులారాశిలో ప్రవేశించబోతున్నాడు. అక్టోబరు 17, సోమవారం నాడు రాత్రి 07:22 గంటలకు కన్యారాశి నుండి బయలుదేరి తులారాశిలోకి (Sun Transit 2022) ప్రవేశిస్తాడు. దాదాపు నెలరోజులపాటు అంటే నవంబరు 16 వరకు ఇదే రాశిలో ఉంటుంది.  తులారాశిలో ప్రవేశించిన తర్వాత సూర్యుడు బలహీన స్థితిలో ఉంటాడు. దీని వల్ల దాదాపు నెల రోజుల పాటు కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తాడు. కనిపిస్తాయి. తులరాశిలో సూర్యుడి సంచారం వల్ల ఏయే రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.

ఈ రాశులపై సూర్యుడి ప్రతికూల ప్రభావం
మేషరాశి (Aries): కన్యారాశిలో సూర్యుని రాక మేషరాశి వారి జీవితాల్లో ఎన్నో ఒడిదుడుకులను కలిగిస్తుంది. దీని ప్రభావం మీ వైవాహిక జీవితంపై ఎక్కువగా కనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామితో గొడవలు రావచ్చు. అంతేకాకుండా మీ పనిలో మీరు రాణించలేకపోవచ్చు. కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. 
మిథునరాశి (Gemini): సూర్యుని సంచారం మిధున రాశివారిలో కోపాన్ని పెంచుతుంది. దీని ప్రభావం మీ ఇమేజ్‌పై పడుతుంది. మీ పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. వీలైతే బయట పుడ్ తినడం మానేయండి. 
తులారాశి (Libra); సూర్యుడు ఈ రాశిలోనే సంచరించనున్నాడు. దీని ప్రభావం తులరాశివారిపైనే ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సమస్యలు మీకు చికాకు కలిగిస్తాయి. మీ ఖర్చులు పెరుగడం వల్ల మీ వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. ఈ టైంలో చర్మవ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. 

వృశ్చిక రాశి (Scorpio): సూర్యుని సంచారం కారణంగా ఈ రాశివారికి పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగం మారాలనే ఆలోచనలో ఉన్నవారు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. అలాగే ఫ్యామిలీలో గొడవలు రావచ్చు. మెుత్తానికి ఈసమయం సమస్యలతో నిండి ఉంటుంది.  
కుంభరాశి (Aquarius): ఈ రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉండదు. ప్రయాణాలు కలిసిరావు. మీ డబ్బు వృథా అవుతుంది. మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే గొడవలు తలెత్తవచ్చు. ఈ సమయంలో వివాదాలను సజావుగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. 

Also Read: Sun Transit 2022: తులరాశిలో సూర్య సంచారం.. 30 రోజులపాటు ఈరాశులకు డబ్బే డబ్బు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More