Home> ఆధ్యాత్మికం
Advertisement

Sun Transit 2023: సూర్యుడి గోచారంతో తులా రాశి జాతకులు ఎలా నవంబర్ వరకూ ఎలా ఉండాలంటే

Sun Transit 2023: గ్రహాలు నిరంతరం కదులుతూ ఉంటాయి. జ్యోతిష్యం శాస్త్రం ఈ కదలికను రాశి పరివర్తనం లేదా గ్రహ గోచారంగా భావిస్తుంది. ఏదేమైనప్పటికీ గ్రహాల కదలికకు జ్యోతిష్యంలో విశేష ప్రాధాన్యత, మహత్యముంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Sun Transit 2023: సూర్యుడి గోచారంతో తులా రాశి జాతకులు ఎలా నవంబర్ వరకూ ఎలా ఉండాలంటే

Sun Transit 2023: సూర్యుడిని హిందూమతంలో గ్రహాల రారాజుగా పిలుస్తారు. అందుకే సూర్యుడి గోచారానికి జ్యోతిష్యం ప్రకారం మరింత ప్రాధాన్యత ఉందంటారు. సూర్యుడి అక్టోబర్ 18వ తేదీన రాశి మారుతున్నాడు. బుధుడి రాశి నుంచి శుక్రుడి రాశిలోకి సూర్యుడి ప్రవేశముంటుంది. ఫలితంగా సింహ రాశి జాతకులకు విశేషమైన లాభాలు కలగనున్నాయి. ఈ రాశి వారికి అదృష్టం కలిసిరానుంది. ఉద్యోగస్థులకు మంచి సమయంగా భావిస్తారు. సూర్యుడి కటాక్షంతో అంతా అనుకూల పరిణామాలు కలగనున్నాయి. సోదర సోదరీమణులు, యాత్రికులకు సూర్యుడి అనుగ్రహం తోడుగా ఉంటుందంటారు. నవంబర్ 17 వరకూ సూర్యుడు తులా రాశిలో ఉండటం వల్ల తులా రాశి జాతకుల జాతకం పూర్తిగా మారనుంది. 

తుల రాశి జాతకుల ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. పరస్పర సంప్రదింపులు జరగక పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. మార్కెట్‌లో పోటీ ఎక్కువగా ఉన్నాతుల రాశి జాతకులకు అంతా అనుకూలంగా ఉండనుంది. వ్యాపార విషయాల్లో పూర్వీకుల నుంచి వివాదం ఏర్పడవచ్చు. అదే సమయంలో పెద్ద పెద్ద కంపెనీల్నించి లాభాలు కలగనున్నాయి. నెట్‌వర్క్ అభివృద్ది పర్చేందుకు ప్రయత్నాలు కొనసాగించాల్సి ఉంటుంది. విద్యార్ధులు చదువు నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. అక్టోబర్ 30 వరకూ అందరితో జాగ్రత్తగా మసలుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న విషయాల్లో విబేదాలు తలెత్తవచ్చు. 

చెడిన బంధాలు ఈ సమయంలో సెట్ కావచ్చు. అందుకు తగ్గ ప్రయత్నాలు మాత్రం చేయాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో అహంకారం వదిలి సామరస్యంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృద్ధులు ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు వెంటాడవచ్చు. 

Also read: Mars-Ketu Transit: ముగుస్తున్న మంగళ-కేతు యుతి, నవంబర్‌లో ఇక ఆ 5 రాశుల ఇంట ధన ప్రవాహమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More