Home> ఆధ్యాత్మికం
Advertisement

Surya Gochar 2023: కర్కాటకలోకి సూర్యుడు.. సంవత్సరం తర్వాత ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం

Sun Gochar in Cancer 2023: సూర్యుడి రాశి మార్పు ప్రజల జీవితాలపై పెను ప్రభావం చూపుతుంది. ఇటీవల ఆదిత్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించనున్నాడు. భానుడు సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందుతారో తెలుసుకుందాం.

Surya Gochar 2023: కర్కాటకలోకి సూర్యుడు.. సంవత్సరం తర్వాత ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం

Sun Transit in Cancer 2023: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. నెలకొకసారి ఆదిత్యుడు తన రాశిని మారుస్తాడు. సంవత్సరం మెుత్తం మీద 12 రాశులలో సంచరించనున్నాడు. జూన్ 15న సూర్యభగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశించాడు. సూర్యుడు ఈ రాశిలోకి ప్రవేశించడానికి సంవత్సరం పట్టింది. సూర్యుడి సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 

మిధునరాశి
కర్కాటక రాశిలో సూర్యుని సంచారం మిథునరాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. మీ రాశి యెుక్క రెండో ఇంట్లో ఆదిత్యుడు సంచరించాడు. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు. 

మీనరాశి
ఆదిత్యుడి ప్రభావం మీనరాశి వారికి శుభఫలితాలను ఇస్తుంది. మీ రాశిచక్రంలోని ఐదవ ఇంట్లో సూర్యుడు సంచరించాడు. దీని వల్ల సంతానం లేని వారికి పిల్లలు కలుగుతారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. లవ్ సక్సెస్ అవుతుంది. కోర్టు కేసుల్లో మీరు విజయం సాధిస్తారు. 

ధనుస్సు రాశి
ఈ రాశి వారికి సూర్యుని సంచారం శుభప్రదంగా ఉండబోతుంది. సూర్యుడు మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో సంచరించనున్నాడు. మీకు లక్ కలిసి వస్తుంది. మీరు పని లేదా వ్యాపార నిమిత్తం బయటకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మీరు ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తారు. అదృష్టం మీ వెంట ఉంటుంది. పెండింగ్ లో పనులు పూర్తవుతాయి.

Also Read: Jupiter transit 2023: విపరీత రాజయోగంతో మారనున్న ఈ రాశుల ఫేట్.. ఇందులో మీరాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More