Home> ఆధ్యాత్మికం
Advertisement

Sun Transit August 2022: ఆగస్టు 17 నుంచి ఈ 4 రాశుల అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుంది!

Sun Transit August 2022: మరో రెండు రోజుల్లో సూర్యభగవానుడు తన సొంత రాశి అయిన సింహారాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రాశి మార్పు 4 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండనుంది.
 

Sun Transit August 2022: ఆగస్టు 17 నుంచి ఈ 4 రాశుల అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుంది!

Sun Transit August 2022: ఆస్ట్రాలజీలో సూర్యుడిని గ్రహాల రాజు అంటారు. సూర్యుని స్థానంలో చిన్న మార్పు కూడా మొత్తం 12 రాశుల వారిపై పెను ప్రభావం చూపుతుంది. సూర్యుడు సింహ రాశికి అధిపతి. ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్న సూర్యభగవానుడు ఆగస్టు 17, 2022న సింహరాశిలోకి (Sun Transit August 2022) ప్రవేశించబోతున్నాడు. సూర్యుని ఈ రాశి మార్పు 4 రాశుల వారికి చాలా శుభప్రదం కానుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.

సూర్య సంచారం ఈ 4 రాశులవారికి లాభం

మేషరాశి (Aries): సూర్యుని సంచారం మేషరాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ప్రమోషన్ పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. 

కర్కాటకం (Cancer): సూర్యుడి రాశి మార్పు కర్కాటక రాశి వారికి భారీ లాభాలను తెచ్చిపెడుతుంది. అనేక మార్గాల ద్వారా మీకు డబ్బు లభిస్తుంది. ఈ సమయంలో ధనాన్ని పొదుపు చేస్తారు. ఆదాయం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాలు రాణిస్తారు.  

సింహం (Leo): సింహ రాశికి అధిపతి సూర్యుడు మరియు సూర్యుడు ఈ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కావున సింహ రాశి వారిపై దీని ప్రభావం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఆఫీసులో మీ పని ప్రశంసించబడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. 

మీనం (Pisces): సూర్యుని సంచారం మీన రాశి వారికి విజయాన్ని చేకూరుస్తుంది. కొత్త జాబ్ వస్తుంది. ఉద్యోగులు లాభపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.

Also Read: Weekly Horoscope: ఈ వారం ఈ 3 రాశులవారు ధనవంతులు అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More