Home> ఆధ్యాత్మికం
Advertisement

Sun Transit 2023: బుధుడు రాశిలో శక్తివంతమైన రాజయోగం.. ఈ రాశులవారు పట్టిందల్లా బంగారం

Surya Gochar 2023: త్వరలో మిథున రాశిలో సూర్యుడు మరియు బుధుడు కలయిక వల్ల శక్తివంతమైన రాజయోగం ఏర్పడనుంది. ఇది మూడు రాశులవారికి కలిసి రానుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

Sun Transit 2023: బుధుడు రాశిలో శక్తివంతమైన రాజయోగం.. ఈ రాశులవారు పట్టిందల్లా బంగారం

Sun Transit 2023 making Powerful Rajyog in Gemini: జ్యోతిషశాస్త్రంలో సూర్యుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు.  ఇతడిని ఆత్మ, తండ్రి, గౌరవం మరియు విజయానికి కారకుడిగా ఆదిత్యుడిని భావిస్తారు. ప్రస్తుతం సూర్యుడు బుధుడి రాశి అయిన మిథునరాశిలో సంచరిస్తున్నాడు. పైగా మెర్క్యూరీ, సన్ మిత్రులు కూడా. మరో నాలుగు రోజుల్లో మెర్క్యూరీ కూడా తన సొంత రాశిలో ప్రవేశించబోతున్నాడు. మిథునరాశిలో వీరిద్దరి కలయిక వల్ల శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది. ఇది మూడు రాశులవారికి కలిసి రానుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 

మిధునరాశి
సూర్యుడు మరియు బుధ గ్రహాల యొక్క శక్తివంతమైన రాజయోగం మిథునరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ జాతకంలో మూడో ఇంటికి సూర్యదేవుడు అధిపతి. మీ ధైర్యంతోపాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. విదేశాల నుండి మీరు లాభం పొందుతారు. మీకు అదృష్టం కలిసి వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. 

Also Read: Mars transit 2023: జూలై 01న అంగారక సంచారం.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు..

సింహరాశి 
బుధుడు మరియు సూర్యుడి కలయిక సింహరాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీ ఆదాయ గృహంలో సూర్యభగవానుడు సంచరిస్తున్నాడు. దీంతో మీరు అనుకోకుండా ధనాన్ని పొందుతారు. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీరు విదేశాల నుండి డబ్బు అందుతుంది. పాలిటిక్స్ ఉన్నవారికి ఈ సమయం బాగుంటుంది. పదవి కూడా లభించే అవకాశం ఉంది. 

ధనుస్సు రాశి
సూర్యభగవానుడి శక్తివంతమైన రాజయోగం ధనుస్సు రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. సూర్యభగవానుడు అదృష్ట స్థానానికి అధిపతి. పైగా మీ రాశి యెుక్క ఏడవ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఈ సమయంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ దాంపత్య జీవితంలో సంతోషం నెలకొంటుంది.  మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. 

Also Read: Mercury transit 2023: జూన్ 24 నుంచి ఈ 5 రాశులకు అదృష్టం, ఐశ్వర్యం.. మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More