Home> ఆధ్యాత్మికం
Advertisement

Surya Dev: ఆదిత్యుడి కుంభరాశి ప్రవేశం... ఈ రాశులకు తిరుగులేనంత ధనం..

Surya Gochar 2023: నిన్ననే సూర్య భగవానుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. దీంతో మూడు రాశులవారి పంట పండింది. 
 

Surya Dev: ఆదిత్యుడి కుంభరాశి ప్రవేశం... ఈ రాశులకు తిరుగులేనంత ధనం..

Sun Transit In Aquarius 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, ఆత్మ, తండ్రి, పరిపాలన మరియు ప్రభుత్వ ఉద్యోగానికి కారకుడిగా సూర్యభగవానుడిని భావిస్తాం. ఈయన నెలకొకసారి తన రాశిని మారుస్తాడు. ఇలా సంవత్సరం మెుత్తం మీద 12 రాశుల్లో సంచరిస్తాడు. సూర్యుడి రాశి మార్పునే మనం సంక్రాంతి అని పిలుస్తాం. నిన్న గ్రహాల రాజు అయిన సూర్యదేవుడు కుంభంలోకి ప్రవేశించాడు. అందుకే దీనిని  కుంభ సంక్రాంతి అని అంటారు. ఈ సూర్యుడి గోచారం వల్ల ఏయే రాశులవారిని అదృష్టం వరించనుందో తెలుసుకుందాం. 

సూర్యుడి గోచారం ఈ రాశులకు వరం
మేష రాశిచక్రం
ఈ రాశి యెుక్క 11వ ఇంట్లో సూర్యుడు సంచరిస్తున్నాడు. దీంతో వీరి ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. అంతేకాకుండా మేషరాశి వ్యక్తుల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. పెట్టుబడులు మంచి లాభాలను  తెచ్చిపెడతాయి. మీరు స్టాక్ మార్కెట్, బెట్టింగ్ లేదా లాటరీలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇదే అనుకూల సమయం. 
వృషభ రాశి
సూర్య భగవానుడి రాశి మార్పు మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యభగవానుడు మీ రాశిచక్రం గుండా కార్యక్షేత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. అందుకే వ్యాపారస్తులు ఈ సమయంలో లాభాలను పొందే అవకాశం ఉంది. అలాగే నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు ఇంక్రిమెంట్ మరియు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు కోరుకున్న చోటుకి ట్రాన్సఫర్ కూడా అవ్వచ్చు.  
ధనుస్సు రాశిచక్రం
సూర్య గ్రహం యొక్క రాశిచక్రం మార్పు ధనుస్సు రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యభగవానుడు మీ రాశి నుండి మూడవ ఇంటిలో సంచరిస్తాడు. దీని  కారణంగా మీలో ధైర్యం పెరుగుతుంది. కెరీర్‌కు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక విషయాలలో మీరు ప్రయోజనం పొందుతారు. విదేశాల్లో వ్యాపారం చేసేవారు మంచి లాభాలను గడిస్తారు. మీకు తోబుట్టవుల మద్దతు లభిస్తుంది.

Also read: Surya Gochar 2023: మార్చి 15 వరకు ఈరాశుల వారు జాగ్రత్త... ఇందులో మీరున్నారా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More