Home> ఆధ్యాత్మికం
Advertisement

Sun Transit 2022: తులరాశిలో సూర్య సంచారం.. 30 రోజులపాటు ఈరాశులకు డబ్బే డబ్బు..

Sun Transit 2022: అంగారకుడు రాశి మారిన తర్వాత రోజే సూర్యభగవానుడు వేరే రాశిలో సంచరించనున్నాడు. సూర్యుడి రాశి మార్పు 5 రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.  
 

Sun Transit 2022: తులరాశిలో సూర్య సంచారం.. 30 రోజులపాటు ఈరాశులకు డబ్బే డబ్బు..

Sun Transit 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, సూర్యభగవానుడు ప్రతి నెలా రాశిచక్రాన్ని మారుస్తాడు. సూర్యుడు విశ్వాసం, విజయం, తండ్రి, గురువు మరియు శక్తికి కారకుడిగా భావిస్తారు. సూర్యుడి రాశిలో మార్పు అందరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. పంచాంగ ప్రకారం, అంగారక సంచారం అక్టోబరు 16న జరుగుతుంది. తర్వాత రోజే అంటే అక్టోబరు 17న సూర్యదేవుడు తులరాశిలోకి (Sun transit in libra 2022) ప్రవేశించనున్నాడు. శుక్రుడి రాశి అయిన తులారాశిలో  సూర్యుడు దాదాపు నెలపాటు ఉంటాడు. తులరాశిలో సూర్య సంచారం ఈ 5 రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

వృషభం (Taurus): వృషభ రాశికి అధిపతి కూడా శుక్రుడు. దీంతో తులరాశిలో సూర్య సంచారం ఈరాశివారికి కూడా చాలా మేలు చేస్తుంది. వీరికి అదృష్టం ఉంటుంది. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి దొరికే అవకాశం ఉంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారం విస్తరిస్తుంది.  ఆదాయం పెరుగుతుంది. 
సింహం (Leo): సూర్యుడి రాశి మార్పు వల్ల సింహరాశి వారు కెరీర్ లో పురోగతి ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విదేశాల్లో వ్యాపారం చేసే వారు భారీ లాభాలను గడిస్తారు. 
ధనుస్సు (Sagittarius): వీరు కెరీర్ కు సంబంధించిన శుభవార్తలను వింటారు. ఈరాశి వ్యక్తులకు ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలను పొందవచ్చు. ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. 
మకరం(Capricorn): సూర్యుడి సంచారం వల్ల ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ధనం లాభదాయకంగా ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పెండింగ్ వర్క్స్ పూర్తవుతాయి. 
మీనం (Pisces): వీరికి అదృష్టం కలిసి వచ్చి అన్ని పనులను సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్  లభిస్తుంది. విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. 

Also Read: Guru Margi 2022: దీపావళి తర్వాత ఈ రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Read More