Home> ఆధ్యాత్మికం
Advertisement

Surya gochar 2022: డిసెంబర్ 16 ధన సంక్రాంతి నాడు ఇలా చేస్తే..మీ అదృష్టం సూర్యుడిలా మెరుస్తుంది

Surya gochar 2022: గ్రహాలకు రాజైన సూర్యుడు డిసెంబర్ 16, 2022 న ధనస్సురాశిలో గోచారం చేయనున్నాడు. అదే ధన సంక్రాంతి. ధన సంక్రాంతి నాడు చేసే పూజలు వెంటనే ప్రభావం చూపిస్తాయి. భారీగా ప్రయోజనం కలుగుతుంది. 
 

Surya gochar 2022: డిసెంబర్ 16 ధన సంక్రాంతి నాడు ఇలా చేస్తే..మీ అదృష్టం సూర్యుడిలా మెరుస్తుంది

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల రాజైన సూర్యుడు ప్రతినెలా రాశి మారుతుంటాడు. సూర్య గోచారాన్ని సంక్రాంతి అంటారు. 2022 డిసెంబర్ 16న సూర్యుడి ధనస్సు రాశిలో ప్రవేశం సందర్భంగా ఏం జరగనుందో తెలుసుకుందాం..

ధన సంక్రాంతి డిసెంబర్ 16 2022 నుంచి జనవరి 14, 2023 వరకూ ఉంటుంది. జనవరి 14వ తేదీ రాత్రి సూర్యుడు మకరంలో ప్రవేశించిన తరువాత అంటే జనవరి 15, 2023న మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. దీనివల్ల అంతా శుభమే జరగనుంది. సూర్యుడి ధనస్సు రాశిలో ఉండే సమయంలో కొన్ని ఉపాయాలు పాటిస్తే తక్షణం ఆ ప్రభావం కన్పిస్తుంది.

ధన సంక్రాంతి నాడు చేయాల్సిన ఉపాయాలు

ధన సంక్రాంతి రోజు పవిత్ర నదిలో స్నానమాచరించి..దానాలు చేయాలి. ఈ రోజున పేదలకు భోజనం పెట్టడం, వస్త్రదానం చేయడం వల్ల అధిక పుణ్యం లభిస్తుంది. ధన సంక్రాంతి నాడు సూర్య దేవుడికి ఆర్ఘ్యం ఇచ్చి పూజలు చేయాలి. దాంతోపాటు ఈరోజున శివుడిని గంగాజలంతో అభిషేకించాలి. దాంతోపాటు మహా మృత్యుంజయ  మంత్రం పఠించాలి. దీంతో జరగరానివి జరగకుండా ఉంటాయి. కష్టాలు తొలగిపోతాయి.

ధన సంక్రాంతి నాడు విష్ణు భగవానుడిని, లక్ష్మీదేవిని పూజించాలి. వీరిని ప్రసన్నం చేసుకునేందుకు యజ్ఞం చేయాలి. దీనివల్ల పోయిన అదృష్టం తిరిగొస్తుంది. లక్ష్మీదేవి ఇంట్లో ఎల్లప్పుడూ ఉంటుంది. అభివృద్ధి చెందుతారు. ధన సంక్రాంతి నాడు ఉప్పు తినకూడదు. వీలైతే ఉపవాసముండాలి. పిత్రులకు తర్పణం వదలాలి. మీ జీవితం సుఖ శాంతులతో వర్ధిల్లుతుంది. 

ధన సంక్రాంతి నాడు వీలైనంత ఎక్కువ సేపు గాయత్రి మంత్రాన్ని జపించాలి. సాధ్యమైతే..గాయత్రి మంత్రాన్ని 24 వేలసార్లు పఠించాలి. గాయత్రి మంత్రంలో చాలాశక్తి ఉంటుంది. ఇది మీ మనోభీష్టాన్ని పూర్తి చేస్తుంది. 

Also read: Venus transit 2023: ఆ మూడు రాశులవారు కొత్త ఏడాదిలో డబ్బులతో తులతూగుతారు, ఎప్పటి నుంచంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More