Home> ఆధ్యాత్మికం
Advertisement

Surya Gochar 2022: తులరాశిలో సూర్యుడి సంచారం...ఏ రాశివారికి లాభం, ఏ రాశివారికి నష్టం?

Sun Transit in Libra 2022: ఇవాళ సూర్యభగవానుడు తన రాశిని మార్చబోతున్నాడు. దీని ప్రభావం ప్రజలందరిపై కనిపిస్తుంది. ఏ రాశులవారు లాభపడనున్నారో, ఏ రాశులవారు ఇబ్బందుల పడనున్నారో తెలుసుకుందాం. 
 

Surya Gochar 2022: తులరాశిలో సూర్యుడి సంచారం...ఏ రాశివారికి లాభం, ఏ రాశివారికి నష్టం?

Surya Rashi Parivartan 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఇవాళ (అక్టోబర్ 17, 2022) సూర్యభగవానుడు తన రాశిని మార్చనున్నాడు. కన్యారాశి నుంచి తులరాశిలోకి (Sun Transit in Libra 2022)ప్రవేశించనున్నాడు. సూర్యుడి యెుక్క ఈ రాశి మార్పు మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. సూర్యదేవుడు నెలరోజులపాటు అంటే నవంబరు 16 వరకు అక్కడే ఉండనున్నాడు. సూర్యుడి సంచారం ఏ రాశివారిపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

మేషం (Aries)- జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు. బిజినెస్ డీల్ కుదుర్చుకునేటప్పుడు చదివి సంతకం చేయండి. 
వృషభం (Taurus)- కుటుంబ జీవితం బాగుంటుంది. వ్యాపారంలో భారీగా లాభం ఉంటుంది. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. శత్రువులపై విజయం సాధిస్తారు. మీరు ఏ పని తలపెట్టినా సజావుగా పూర్తవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి.  
మిథునం (Gemini)- అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు. కష్టపడి పని చేసినా ఆశించిన ఫలితాలు రావు. కెరీర్ కష్టంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. కోపం, ఆక్రోశం పెరుగుతుంది. 
కర్కాటక రాశి (Cancer)- మీ మాట తీరు వివాదాలకు కారణమవుతుంది. సకాలంలో పని పూర్తి చేయకపోవడం వల్ల కోపం వస్తుంది. ఫ్యామిలీలో విభేదాలు తలెత్తవచ్చు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దల సలహా తీసుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. 
సింహం (Leo)- ఈ నెల వృత్తి జీవితానికి అనుకూలంగా ఉంటుంది. అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇంట్లో ఆనందం వెల్లివిరిస్తుంది. హెల్త్ బాగుంటుంది.  

కన్య రాశి (Virgo)- పని ప్రదేశంలో ఓపికగా ఉండండి మరియు ఎవరితోనూ వాదించకండి. ఖర్చును నియంత్రణలో ఉంచుకోండి, లేకపోతే ఇబ్బందుల్లో పడతారు. పెట్టుబడి పెట్టే ముందు ఎవరి సలహానైనా తీసుకోండి. 
తుల (Libra)- వృత్తిలో ఒడిదుడుకులు ఉంటాయి. ఇంట్లోని సభ్యులపై అనవసరంగా కోపం తెచ్చుకోకండి. వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు. 
వృశ్చికం (Scorpio)- ఆఫీసులో పని పూర్తవ్వకపోవడం వల్ల నిరాశ చెందుతారు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు చేసే వారికి లాభిస్తుంది. ఇంట్లో ఆనందం ఉంటుంది. 
ధనుస్సు (Sagittarius)- వృత్తిలో అద్భుతమైన పురోగతి ఉంటుంది. మీకు బాస్ సపోర్టు లభిస్తుంది. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. శత్రువులపై విజయం ఉంటుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. 
మకరం (Capricorn)- సూర్య సంచారం మకర రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. పనిలో ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారస్తులు కూడా లాభపడతారు. ఇంట్లో సంతోషం నెలకొంటుంది.
కుంభం (Aquarius)- వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఉండవచ్చు. ఆఫీసులో కూడా ఇబ్బందులు ఉండవచ్చు. ప్రయాణాలు మానుకోండి. 
మీనం (Pisces)- ఈ నెల కెరీర్‌కు చాలా బాగుంటుంది. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ సమయంలో పెట్టుబడి పెట్టండి కానీ ఎవరి దగ్గరా అప్పు తీసుకోకండి. 

Also Read: Sun Transit 2022: ఇవాళే తులరాశిలోకి సూర్యుడి ప్రవేశం.. మారనున్న వీరి భవితవ్యం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More