Home> ఆధ్యాత్మికం
Advertisement

Surya- Shukra Gochar 2022: రేపు కన్యారాశిలో సూర్యుడు, శుక్రుడు కలయిక... ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే..!

Shukra Grah Gochar 2022: సెప్టెంబర్ 24న కన్యారాశిలో సూర్యుడు, శుక్రుడు కలిసి కూర్చోబోతున్నారు. వీరి కలయికతో 4 రాశుల వారికి అదృష్టం కలిసిరానుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 
 

Surya- Shukra Gochar 2022: రేపు కన్యారాశిలో సూర్యుడు, శుక్రుడు కలయిక... ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే..!

Surya Shukra yuti 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి నెలా ఏదో ఒక గ్రహం తన రాశిని మార్చుకుంటూ ఉంటుంది. ఈ రాశిమార్పు మొత్తం 12 రాశులపై ప్రభావం చూపుతుంది. కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, మరికొందరికి అశుభ ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు సెప్టెంబర్ 24న శుక్రుడు కన్యారాశిలోకి (Venus Transit In Virgo 2022) ప్రవేశించనున్నాడు. ఇప్పటికే ఆ రాశిలో సూర్యుడు కూర్చుని ఉన్నాడు. రేపు కన్యారాశిలో ఈ రెండు రాశుల కలయికతో 4 రాశులవారి అదృష్టం మారిపోనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

లక్కీ రాశులివే..
వృశ్చికం (Scorpio): మీరు ఆర్థికంగా బలపడతారు. ఈ సమయం వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. వివిధ మార్గాల ద్వారా ఆదాయం వస్తుందగి. మీ కృషితో మీరు కొత్త శిఖరాలను ఆధిరోహిస్తారు. ఫ్యామిలీతో ఆనందంగా గడిపే అవకాశం లభిస్తుంది. 

మిథునం (Gemini): ఈ రాశి వారు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆర్థికంగా మెరుగుపడతారు. చాలా డబ్బు సంపాదిస్తారు. మీ ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి.

మీనం (Pisces): ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆఫీసులో మీకు పెద్ద బాధ్యతలు ఇవ్వవచ్చు. మీరు ఏ పెట్టుబడి పెట్టినా లాభం పొందుతారు. మీరు ఏదైనా ఆస్తి లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు కుటుంబ జీవితంలో ఆనందాన్ని పొందుతారు. భారీగా డబ్బు సంపాదిస్తారు. 

కర్కాటకం (Caner): ఈ రాశి వారు ఆరోగ్యంగా ఉంటారు. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ఎక్కడికైనా బయటకు వెళ్లే అవకాశం ఉంది. మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అది తిరిగి వస్తుంది. మీరు కొత్త వాహనం లేదా ఆస్తిని కూడా కొనుగోలు చేయవచ్చు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. 

Also Read: ధనత్రయోదశి రోజున శని గమనంలో మార్పు... ఈ 5 రాశులవారికి ఊహించని ధనం! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More