Home> ఆధ్యాత్మికం
Advertisement

Navratri 2023: నవరాత్రులలో తులారాశిలో బుధాదిత్య యోగం... ఈ 3 రాశులపై డబ్బు వర్షం..

Sun and Mercury Conjunction 2023: నవరాత్రుల్లో బుధుడు మరియు సూర్యుడు కలయిక ఏర్పడబోతుంది. ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల మూడు రాశుల వారు లాభపడనున్నారు. 
 

Navratri 2023: నవరాత్రులలో తులారాశిలో బుధాదిత్య యోగం... ఈ 3 రాశులపై డబ్బు వర్షం..

Budhaditya Yog 2023 in October: గ్రహాల రాజు సూర్యదేవుడు మరియు గ్రహాల రాకుమారుడు బుధుడు ప్రస్తుతం కన్యారాశిలో సంచరిస్తున్నారు. నవరాత్రి సమయంలో సూర్యుడు మరియు బుధుడు కన్యారాశి నుంచి బయటకు వచ్చి తులరాశిలో కలవబోతున్నారు. అక్టోబరు 18న మధ్యాహ్నం 01:29 గంటలకు సూర్యభగవానుడు అక్టోబర్ 19 మధ్యాహ్నం 1:16 గంటలకు బుధుడు తులరాశిలోకి ప్రవేశించనున్నారు. ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. ఆస్ట్రాలజీలో దీనిని పవిత్రమైన యోగంగా భావిస్తారు. బుధాదిత్య రాజయోగం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 

తులారాశి
సూర్యుడు మరియు బుధుడు కలయిక ఇదే రాశిలో జరగబోతుంది. దీని కారణంగా ఏర్పడిన బుధాదిత్య యోగం వల్ల తులారాశి వారు చాలా ప్రయోజనం పొందుతారు. మీరు ఆఫీసులో పెద్ద పొజిషన్ కు వెళతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభాలను గడిస్తారు. 

కన్యా రాశి 
ఈ రాశి యెుక్క డబ్బు ఇంట్లో బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. ఇదే రాశిలో బుధుడు ఉచ్ఛస్థితిలో ఉంటాడు. దీంతో కన్యారాశి వారు ప్రయోజనం పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీ బిజినెస్ విస్తరిస్తుంది. మీరు అన్ని కష్టాల నుండి విముక్తి పొందుతారు. 

ధనుస్సు రాశి
మీ ఆదాయ గృహంలో సూర్యుడు మరియు బుధుడు ఉంటారు. దీంతో మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు ద్వారా మీరు లాభాలను గడిస్తారు. పూర్వీకుల ఆస్తులు మీకు కలిసి వస్తాయి. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. వ్యాపారస్తులు ఈహించని లాభాలను పొందుతారు. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు.

Also Read: Saturn-Rahu conjunction: శని, రాహువు గ్రహాల కలయికతో ఈ రాశులవారి జీవితాల్లో ఊహించని నష్టాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More