Home> ఆధ్యాత్మికం
Advertisement

Sravana Masam 2022: శ్రావణ మాసంలో ఈ చిన్న వస్తువులను కొనండి... అపారమైన డబ్బును పొందండి

Sravana Masam 2022: శివుడికి ఎంతో ప్రీతికరమైన నెల శ్రావణ మాసం. ఈ నెలలో కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా పరమేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు. 
 

Sravana Masam 2022:  శ్రావణ మాసంలో ఈ చిన్న వస్తువులను కొనండి... అపారమైన డబ్బును పొందండి

Sawan 2022 Auspicious Things:  హిందువులకు పవిత్రమైన శ్రావణ మాసం నేటి నుండి ప్రారంభంకానుంది. ఈ మాసంలో శివుడిని (Lord Shiva) పూజిస్తారు. మహాదేవుడికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ నెలలో కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా శివుడితోపాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందవచ్చు. ఆస్ట్రాలజీలో (Astrology) దీనికి సంబంధించిన విషయాలు గురించి వివరంగా చెప్పబడ్డాయి.  ఆ వస్తువులేంటో ఓసారి తెలుసుకుందాం. 

డమరుకం- శ్రావణ మాసంలో డమరుకం వాయించి శివుడిని స్తుతిస్తే.. పరమశివుడు ప్రసన్నుడై భక్తుల కోర్కెలన్నింటినీ తీరుస్తాడని నమ్ముతారు. అందుకే ఈ మాసంలో దీనిని కొనుగోలు చేస్తారు. 

వెండి కడియం- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శ్రావణ మాసంలో వెండి కంకణం కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీని కొనుగోలు చేయడం ద్వారా పేదరికం తొలగిపోయి శివుడి అనుగ్రహం లభిస్తుంది. 

వెండి పెట్టె- శివుని చితాభస్మాన్ని ఇంట్లో ఉంచడం ద్వారా వ్యక్తి యొక్క దారిద్ర్యం తొలగిపోతుందని నమ్ముతారు. ఇందుకోసం వెండి పెట్టెలో అస్థికలను ఉంచి పూజలో ఉంచాలి. ఆ తర్వాత దానిని డబ్బు పెట్టుకునే స్థలంలో ఉంచితే ధనం రాక పెరుగుతుంది. 

శివలింగం- శ్రావణ మాసంలో ఇంటి పూజా మందిరంలోకి ఒక చిన్న శివలింగాన్ని కొనుగోలు చేయండి. ఇది రెండు అంగుళాలు కంటే ఎక్కువ ఉండకూడదు. అంతేకాకుండా క్రమం తప్పకుండా శివలింగాన్ని పూజించాలి. ఇంట్లో శివలింగాన్ని ఉంచితే శాస్త్రబద్దమైన కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. 

రుద్రాక్ష - రుద్రాక్ష శివుని కన్నీటి నుండి ఉద్భవించిందని నమ్ముతారు. అందుకే శ్రావణ మాసంలో రుద్రాక్షను ఇంటికి తీసుకురావడం వ్యక్తి యెుక్క  పురోగతికి కొత్త మార్గాలను తెరిచినట్లు అవుతుంది. సంపద కూడా రెట్టింపు అవుతుంది. అంతే కాదు శ్రావణ మాసంలో రుద్రాక్ష ధరించడం వల్ల మనిషికి ఎటువంటి రోగాలు రావు. 

Also Read: Thursday Puja tips: డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే.. గురువారం ఈ పరిహారం చేయండి! 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More