Home> ఆధ్యాత్మికం
Advertisement

Sravana Masam 2022: త్వరలో శ్రావణం ప్రారంభం.. ఈ మాసంలో ఈ తప్పులు చేయకండి!

Sravana Masam 2022: శ్రావణ మాసం త్వరలో ప్రారంభం కానుంది. శివునికి ఎంతో ఇష్టమైన ఈ  మాసంలో కొన్ని పనులు చేయడం నిషిద్ధం. 
 

Sravana Masam 2022: త్వరలో శ్రావణం ప్రారంభం.. ఈ మాసంలో ఈ తప్పులు చేయకండి!

Sawan 2022 Starting Date: పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన శ్రావణ మాసం మరో తొమ్మిది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మాసం (Sravana Masam) కోసం శివభక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది శ్రావణ మాసం జూలై 14 నుండి మెుదలై... ఆగస్టు 12 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సారి ఈ మాసంలో 5 సోమవారాలు రానున్నాయి. అయితే శ్రావణ సోమవారం వ్రతం చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. వీటిని పాటించకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.  

శ్రావణ మాసంలో ఈ పనులు చేయకండి
>> శ్రావణ మాసంలో మద్యం, మాంసం నిషిద్దం. అంతేకాకుండా బెండకాయ, ముల్లంగి, వెల్లుల్లి కూడా తినకూడదు. ఈ పవిత్రమైన మాసంలో స్వాత్రిక ఆహారాన్ని మాత్రమే తీసుకోండి.
>> శివునికి పాలతో అభిషేకం చేస్తారు కాబట్టి ఈ మాసంలో మీరు పాలు తాగడం మానుకోవాలి.
>> శ్రావణ మాసంలో చెడు పనులు మరియు చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులను, గురువును, అతిథిని లేదా మరే ఇతర వ్యక్తిని అవమానించవద్దు.
>> ఈ నెలలో మీ ఇంటికి వచ్చిన పేదవారిని ఖాళీ చేతులతో తిరిగి పంపవద్దు. ఈ సమయంలో జంతువులను వేధించవద్దు.
>> శ్రావణ మాసంలో శరీరానికి నూనె రాసుకోవడం అశుభం. ఇలా చేయడం వల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
>> శివుడిని పూజించేటప్పుడు పసుపు-కుంకుమాన్ని ఆయనకు సమర్పించకూడదని గుర్తుంచుకోండి. 

Also Read: Horoscope Today July 5th: నేటి రాశి ఫలాలు.. ఆ రంగాల్లోని వ్యాపారులకు ఇవాళ ధన లాభం...  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Read More