Home> ఆధ్యాత్మికం
Advertisement

Lunar Eclipse 2023: 30 ఏళ్ల తర్వాత ప్రత్యేక చంద్రగ్రహణం..ఈ 3 రాశుల వారికి విపరీతమైన లాభాలు..

Lunar Eclipse 2023 Impact On 3 Zodiacs: ఈ సంవత్సరంలో ఏర్పడిన చివరి చంద్రగ్రహణ ప్రత్యేక ప్రభావం కొన్ని రాశుల వారిపై పడింది. ఈ ప్రభావం కారణంగా కొన్ని రాశుల వారు ఊహించని లాభాలతో పాటు వ్యక్తిగత జీవితంలో మార్పులు పొందుతారు. ఈ ప్రభావం ఏ రాశుల వారికి శ్రేయస్కరమో ఇప్పుడు తెలుసుకుందాం.

Lunar Eclipse 2023: 30 ఏళ్ల తర్వాత ప్రత్యేక చంద్రగ్రహణం..ఈ 3 రాశుల వారికి విపరీతమైన లాభాలు..

Lunar Eclipse 2023 Impact On 3 Zodiacs: ఈ సంవత్సరంలోని చివరి చంద్రగ్రహణం శరత్ పౌర్ణమి రోజు సంభవించింది. అక్టోబర్ 28వ తేదీ 4:15 నిమిషాల నుంచి పౌర్ణమి ప్రారంభం కాగా.. ఆదివారం తెల్లవారుజామున 1:35 వరకు కొనసాగింది. అయితే ఇదే సమయంలో చంద్రగ్రహణం కూడా సంభవించడంతో కొన్ని ప్రత్యేకమైన ఘడియలు ప్రారంభమయ్యాయి. ఇలా శరత్ పూర్ణిమ రోజు చంద్రగ్రహణం దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు సంభవించిందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ గ్రహణం ప్రభావం ప్రత్యక్షంగా కొన్ని రాశుల వారిపై కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఈ చివరి చంద్రగ్రహణం కారణంగా ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడిందో, ఈ ప్రభావం ఎన్ని రోజుల వరకు కొనసాగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

చంద్రగ్రహణం కారణంగా లాభాలు పొందబోయే రాశుల వారు:
వృషభ రాశి:

ఈ చంద్రగ్రహణం సంభవించిన తర్వాత ఏర్పడిన ప్రత్యేక ప్రభావం కారణంగా వృషభ రాశి వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో ప్రశంసలు పొందుతారు. అంతేకాకుండా ఊహించని ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతోపాటు ఈ రాశుల వారికి ఆదాయ వనరుల్లో కూడా పెరుగుదల ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా బయటపడతారు. ఎలాంటి పనుల్లోనైనా ఈ సమయంలో సులభంగా విజయాలు సాధిస్తారు. వైవాహిక జీవితం చాలా శ్రేయస్కారంగా ఉంటుంది.

Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  

మిధున రాశి:
సంభవించిన చంద్రగ్రహణం కారణంగా మిధున రాశి వారిపై కూడా ప్రత్యేక ప్రభావం పడింది. దీని కారణంగా మిధున రాశి వారి వ్యక్తిగత జీవితంలో మార్పులు వస్తాయి. ఈ ప్రభావం కారణంగా మిధున రాశి వారికి ఆర్థికంగా అనేక మార్పులు వస్తాయి. అంతేకాకుండా ఈ సమయంలో ఎలాంటి పనులు కష్టపడి చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. లావాదేవీలు జరపడానికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. అంతేకాకుండా ఉద్యోగాలు, వ్యాపారాల్లో పురోగతి కూడా లభిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి సమాజంలో గౌరవంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి.

సింహరాశి:
సింహ రాశి వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎప్పటినుంచో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వారికి ఇది సరైన సమయంలో భావించవచ్చు. ఈ సమయంలో వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది. వీరికి ఈ సమయంలో స్నేహితులు నుంచి మద్దతు లభించి ఊహించని లాభాలు పొందుతారు.

Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More