Home> ఆధ్యాత్మికం
Advertisement

Solar Eclipse April 2022: ఈ ఏడాది తొలి సూర్యగ్రహణంతో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

జ్యోతిష్య శాస్త్రంలో ఏప్రిల్ నెలు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ నెల మొత్తం 9 గ్రహాల రాశిచక్రం మారుతుంది. ఇందులో గురు, శని, రాహు, కేతు గ్రహాలు కూడా ఉన్నాయి. దీనితోపాటు.. ఏప్రిల్ 30న ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏర్పడనుంది.

Solar Eclipse April 2022: ఈ ఏడాది తొలి సూర్యగ్రహణంతో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

Solar Eclipse April 2022: జ్యోతిష్య శాస్త్రంలో ఏప్రిల్ నెలు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ నెల మొత్తం 9 గ్రహాల రాశిచక్రం మారుతుంది. ఇందులో గురు, శని, రాహు, కేతు గ్రహాలు కూడా ఉన్నాయి. దీనితోపాటు.. ఏప్రిల్ 30న ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏర్పడనుంది.

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహనాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అందులోనూ ఏప్రిల్ 30న సూర్యగ్రహణం మేషరాశిలో ఏర్పడనుంది. ఈ ప్రభావం నాలుగు రాశులపై ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ రాశులు ఏవి? వారిపై ఎలాంటి ప్రభావం పడనుంది ఇప్పుడు తెలుసుకుందాం.

సూర్య గ్రహణం సమయం..

పంచాంగం ప్రకారం ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 30న.. రాత్రి 12:15 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ప్రారంభమవుతుంది. ఆ తర్వాతి రోజు.. అంటే మే 01 ఉదయం 4:7 గంటలకు వరకు ఉంటుంది. ఇది పాక్షికంగా ఏర్పడనుంది.

సూర్యగ్రహణం ప్రభావం అధికంగా ఉండే నాలుగు రాశులు..

వృషభం:

సూర్యగ్రహణం వల్ల వృషభ రాశి వారికి సానూకులతలు పెరుగుతాయి. ఉద్యోగులకు చిక్కులు వీడుతాయి. ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి చేతికందుతుంది.

కర్కాటకం:

ఈ రాశి వారికి కూడా సూర్య గ్రహనం వల్ల ధనయోగం ఉంది. మరోవైపు వ్యాపారులకు మేలు జరుగుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం ఇది. దూరపు ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.. అయితే ఇవి మీకు మేలు చేయొచ్చని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు.

తుల రాశి:

సూర్య గ్రహణ వల్ల ఈ రాశి వారికి ఉద్యోగ, వ్యాపార పరంగా మేలు జరుగుతుంది. ముఖ్యంగా చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. ఉత్సాహం పెరుగుతుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయగలుగుతారు.

ధనుస్సు రాశి:

సూర్య గ్రహణం వల్ల ఈ రాశివారికి ఈ నెలలో మంచి లాభాలు కలుగుతాయి. ప్రభుత్వ పరంగా ఏవైనా పెండింగ్ పనులు ఉంటే అవి పూర్తవుతాయి. కుటుంబం, స్నేహితుల నుంచి సపోర్ట్ లభిస్తుంది. ఆర్థికంగా నెలదొక్కుకుంటారు. గతంతో పోలిస్తే మెరుగయ్యామనే అనుభూతి కలుగుతుంది.

(నోట్​: ఈ కథనంలోని సమాచారం కేవలం జ్యోతిష్య నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. ZEE తెలుగు NEWS ఈ కథనాన్ని ధ్రువీకరించలేదు.)

Also read: Weekly Horoscope: రాశి ఫలాలు ఏప్రిల్ 11-ఏప్రిల్ 17... ఆ రాశి వారికి ఆర్థిక నష్టాలు తప్పకపోవచ్చు..

Also read: Sun Transit 2022: రాశి మారనున్న సూర్యుడు.. ఏప్రిల్ 14న నుండి ఈ 4 రాశుల వారికి అంతా మేలే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More