Home> ఆధ్యాత్మికం
Advertisement

Rahu Dosh: మీకు రాత్రిపూట నిద్ర రావడం లేదా? పదే పదే పీడకలలు వస్తున్నాయా? అయితే ఇది రాహు దోషం, వెంటనే ఈ పరిహారాలు చేయండి

Rahu Transit 2022: అశుభ రాహువు జీవితంలో అనేక ఇబ్బందులను కలిగిస్తాడు. రోగాలు మనిషిని చుట్టుముడతాయి. డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడు. పురోగతిలో అడ్డంకులు వస్తాయి. 
 

Rahu Dosh: మీకు రాత్రిపూట నిద్ర రావడం లేదా? పదే పదే పీడకలలు వస్తున్నాయా? అయితే ఇది రాహు దోషం, వెంటనే ఈ పరిహారాలు చేయండి

Rahu Transit 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం మన జీవితంలోని కొన్ని అంశాలను ప్రభావితం చేస్తుంది. జాతకంలో ఆ గ్రహం యొక్క శుభ మరియు అశుభ స్థానం జీవితంలోని సంబంధిత రంగాన్ని ప్రభావితం చేస్తుంది. కావున ఏ గ్రహం అశుభం కలిగిస్తుందో, ఆ గ్రహం వల్ల కలిగే దుష్ఫలితాల నుంచి ఉపశమనం లభించేలా కొన్ని చర్యలు తీసుకోవాలి. జాతకంలో శని, రాహు-కేతువులు వంటి గ్రహాలు అశుభం అయితే, పరిహారం తీసుకోవడంలో ఆలస్యం చేయకూడదు. లేకపోతే జీవితం కష్టాల చుట్టూ తిరగడానికి ఎక్కువ సమయం పట్టదు. ఈరోజు మనకు చెడు రాహువు సంకేతాలు (Signs of Rahu dosh), దాని దుష్ప్రభావాలను వదిలించుకోవడానికి మార్గాలను తెలుసుకుందాం. 

అశుభ రాహువు జీవితాన్ని దుఃఖాలతో నింపుతాడు
రాహువు శుభ ఫలితాలను ఇస్తే మన జీవితం రాజులాగా ఉంటుంది. అదే రాహువు అశుభ ఫలితాలను ఇస్తే...కింగ్ కాస్తా పేదవాడిగా మారిపోతాడు. కాబట్టి, వీలైనంత త్వరగా చెడు రాహువును గుర్తించి, చర్యలు తీసుకోండి. జాతకంలో రాహువు చెడుగా ఉంటే ఆ వ్యక్తి స్వభావం చికాకుగా మారుతుంది. ఇంట్లో నిత్యం గొడవ పడుతూనే ఉంటాడు. మరోవైపు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో రాహువు స్థానానికి భంగం కలిగితే ఆ ఇంట్లో ఎప్పుడూ గొడవలు, అశాంతి వాతావరణం ఉంటుంది. ఇంటి ప్రజల అభివృద్ధి ఆగిపోతుంది. చెడు రాహువు స్థానికులకు నిద్రలేకుండా చేస్తుంది. రాత్రిపూట ఎటువంటి కారణం లేకుండా అతని నిద్ర పదే పదే చెదిరిపోతుంది. అతను టెన్షన్ మరియు తెలియని భయంతో జీవిస్తాడు. అతనికి తరచుగా పీడకలలు వస్తుంటాయి. అతను తాగడం ప్రారంభిస్తాడు. వ్యాధులు అతనిని చుట్టుముడతాయి.

రాహువును వదిలించుకోవడం ఎలా?
రాహు యంత్రాన్ని ఇంట్లో ప్రతిష్టించి రోజూ పూజించండి. పదే పదే నిద్ర సమస్య వస్తుంటే రాత్రి పడుకునేటప్పుడు కొద్దిగా బార్లీ తల దగ్గర పెట్టుకుని పడుకోండి. ఉదయం నిద్రలేచిన తర్వాత నిరుపేదలకు బార్లీని దానం చేయండి. ఇది కాకుండా, రాహువు యొక్క బీజ్ మంత్రం 'ఓం భ్రాం బ్రైన్ భ్రూన్ స: రాహవే నమః' యొక్క 2 నుండి 3 జపమాలలను ప్రతిరోజూ జపించండి.

Also Read: June 2022 Planetary Changes: జూన్‌లో రాశిచక్రాన్ని మార్చబోతున్న 5 గ్రహాలు.. ఈ 3 రాశులవారికి డబ్బే డబ్బు..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More