Home> ఆధ్యాత్మికం
Advertisement

Shukra Uday 2023: మరో 8 రోజుల్లో ఈ రాశుల లైఫ్ టర్న్ కాబోతుంది.. మీ రాశి ఉందా?

Shukra Uday 2023: ఆగస్టు 18న శుక్రుడు కర్కాటక రాశిలో ఉదయించబోతున్నాడు. శుక్రుడి గమనంలో మార్పు వల్ల మూడు రాశులవారు లాభపడనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 
 

Shukra Uday 2023: మరో 8 రోజుల్లో ఈ రాశుల లైఫ్ టర్న్ కాబోతుంది.. మీ రాశి ఉందా?

Venus Rise In Cancer 2023: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత రాశులను మార్చడం, ఉదయించడం లేదా అస్తమించడం చేస్తాయి. మరో 8 రోజుల్లో శుక్రుడు గమనంలో పెనుమార్పు రాబోతుంది. ఆగస్టు 18, రాత్రి 7.17 గంటలకు శుక్రుడు కర్కాటక రాశిలో ఉదయించబోతున్నాడు. దీని ప్రభావం మెుత్తం 12 రాశులవారి జీవితాలపై కనిపించనుంది. శుక్రుడు ఉదయించడం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం. 

కర్కాటక రాశి
శుక్రుడు ఈ రాశి యెుక్క లగ్న గృహంలో ఉదయించబోతున్నాడు. దీంతో ఈ రాశి వారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి. మీ వ్యక్తిత్వంతో నలుగురిని ఆకట్టుకుంటారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు కొనసాగిస్తారు. మీ ఆదాయం పెరుగుతుంది. 
మకరరాశి
ఈ రాశి యెుక్క సప్తమంలో శుక్రుడు ఉదయించనున్నాడు. దీంతో మకరరాశి వారికి మేలు జరగనుంది. మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో మీరు ప్రయోజనం పొందుతారు. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. 
మీనరాశి
మీన రాశి యెుక్క నాల్గో ఇంట్లో శుక్రుడు ఉదయించబోతున్నాడు. దీంతో మీరు అనుకూల ఫలితాలు పొందుతారు. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు స్థిర చరాస్తులు లభిస్తాయి. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. 

Also Read: Mars transit 2023: కన్యారాశిలోకి ప్రవేశించబోతున్న కుజుడు.. ఈ 3 రాశులవారు కుబేరులవ్వడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More