Home> ఆధ్యాత్మికం
Advertisement

Venus transit 2023: త్వరలో శుక్రుడి మీన సంచారం.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం...

Venus transit 2023: వేద క్యాలెండర్ ప్రకారం, శుక్ర గ్రహం కొత్త ఏడాదిలో మీనరాశిలోకి ఎంటర్ అవ్వనుంది. దీని సంచారం మూడు రాశులవారికి వృత్తి, వ్యాపారాల్లో విజయాన్ని ఇస్తుంది. 
 

Venus transit 2023: త్వరలో శుక్రుడి మీన సంచారం.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం...

Venus transit 2023: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. అందుకే ఇతడి రాశి మార్పు చాలా కీలకమైనది. ఐశ్వర్యం మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడైన శుక్రుడి సంచారం ప్రతి ఒక్కరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. మరో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. మరి ఈ ఏడాదిలో శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రాశిలో శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉంటాడు. మీనరాశిలో శుక్ర సంచారం (Venus transit in Pisces 2023) మూడు రాశులవారికి ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది. ఇది ఏ రాశివారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. 

వృషభ రాశి (Taurus): శుక్రుడు సంచరించిన వెంటనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఎందుకంటే శుక్రుడు మీ రాశికి అధిపతి మరియు రాశిచక్రం నుండి పదకొండవ ఇంట్లో సంచరించబోతున్నాడు. దీని కారణంగా మీ ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. ఈ సమయంలో మీరు కొత్త మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తారు. దీంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 

తులా రాశిచక్రం (Libra): శుక్రుడి రాశి మార్పు మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ సంచార జాతకంలో ఆరవ ఇంట్లో సంచరించబోతోంది. దీంతో మీరు మీ శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసుల్లో తీర్పులు మీకు సానుకూలంగా వస్తాయి. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారు పెద్ద డీల్ ను కుదుర్చుకునే అవకాశం  ఉంది. 

కుంభం (Aquarius): శుక్రుని రాశి మార్పు కారణంగా మీకు వృత్తి, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. కుంభరాశిలో శుక్ర సంచారం మీకు ఆర్థికంగా మంచి ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువత కోరికలు నెరవేరుతాయి. పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ తో జీతం పెరిగే అవకాశం ఉంది. 

Also Read: Mars Tarnsit 2023: జనవరి 13న కుజ ప్రత్యక్ష సంచారం.. ఈ 5 రాశుల వారికి అఖండ ఐశ్వర్యం! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Read More