Home> ఆధ్యాత్మికం
Advertisement

Shukra Gochar 2022: మరో 2 రోజుల్లో శుక్రుడి రాశి మార్పు... ఈ రాశులవారికి లగ్జరీ లైఫ్, ఐశ్వర్యం!

Shukra Gochar 2022: సెప్టెంబరు 24న శుక్రగ్రహం కన్యారాశిలో సంచరించనున్నాడు. ఇది కొన్ని రాశులవారికి లగ్జరీ లైఫ్ ను, ఐశ్వర్యాన్ని ఇవ్వనున్నాడు. 
 

Shukra Gochar 2022: మరో 2 రోజుల్లో శుక్రుడి రాశి మార్పు... ఈ రాశులవారికి లగ్జరీ లైఫ్, ఐశ్వర్యం!

Shukra Gochar 2022: నవరాత్రులకు ముందు ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రగ్రహం రాశిని మార్చబోతుంది. ఎల్లుండు అంటే సెప్టెంబరు 24న శుక్రుడు తన రాశిని మార్చి కన్యారాశిలోకి వెళ్లనున్నాడు. ఇప్పటికే సూర్యుడు, బుధుడు కన్యారాశిలో ఉన్నారు. ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహం భావిస్తారు. కన్యారాశిలో శుక్రుడు 23 రోజులపాటు ఉంటాడు. దీని  సంచారం (Shukra Gochar 2022) కారణంగా కొన్ని రాశులవారు ఐశ్వర్యం, లగ్జరీ లైఫ్ ను పొందుతారు. 

వృషభ రాశి (Scorpio); వృషభ రాశికి అధిపతి శుక్ర గ్రహం. శుక్రుడు కన్యారాశిలో ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి అదృష్టం పెరుగుతుంది. ఈ రాశి వారు డబ్బు సంబంధిత సమస్యల నుండి బయటపడతారు. వీరి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 

మిధునరాశి (Gemini): ఈరాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వీరి రొమాంటిక్ లైఫ్ బాగుంటుంది. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. బిజినెస్ బాగుంటుంది. 

కర్కాటకం (Cancer): శుక్రుని రాశిలో మార్పు కర్కాటక రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి వారి పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారంలో భారీ లాభాలను ఆర్జిస్తారు. 

కన్య (Virgo); ఈ రాశి వారికి శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశించిన వెంటనే శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు. కన్య రాశి వారు వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం ద్వారా భారీగా ధనాన్ని ఆర్జిస్తారు. ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. 

Also Read: Surya Gochar 2022: తులరాశిలోకి సూర్యుడు... వచ్చే నెలలో మారనున్న ఈ 6 రాశులవారి భవితవ్యం! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More