Home> ఆధ్యాత్మికం
Advertisement

Shukra Gochar 2022: శుక్ర సంచారం వల్ల ఆ రాశులవారికి ఈ నెల 20 వరకు డబ్బే..డబ్బు..

Shukra Gochar November 2022: గ్రహాల సంచారం వల్ల రాశుల్లో కూడా పలు మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో వ్యక్తుల జీవితాల్లో తీవ్ర మార్పులు వస్తాయి. అయితే శుక్రుని సంచారం వల్ల పలు రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  

Shukra Gochar 2022: శుక్ర సంచారం వల్ల ఆ రాశులవారికి ఈ నెల 20 వరకు డబ్బే..డబ్బు..

Shukra Gochar November 2022: అన్ని గ్రహాలు ఏదో ఒక సమయంలో తమ సొంత రాశిని వదిలి ఇతర రాశిలోకి ప్రవేశిస్తూనే ఉంటాయి. ఇలా ప్రవేశించడాన్నే సంచారం అని అంటారు. గ్రహ సంచారాల వల్ల మనిషి జీవితాల్లో మార్పులు కూడా వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అయితే శుక్ర గ్రహం వృశ్చిక రాశిలోకి సంచారం చేసింది. సంచారం నవంబర్ 11న జరిగింది. దీనివల్ల 12 రాశుల వారి జీవితాల్లో మార్పులు చేర్పులు జరగబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిబంధనలు చెబుతున్నారు. సంచార క్రమంలో కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని వరిస్తే మరికొన్ని రాశుల వారు తీవ్రంగా నష్టపోతారు. ఈ సంచారం ప్రభావం 23 రోజులగా వరకు ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి దీని ప్రభావం 12 రాశులపై 23 రోజుల వరకు ఉండనంది. ఏ రాశుల వారిపై ఎలాంటి ప్రభావం ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

శుక్రుని సంచారం వల్ల ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది:
మేష రాశి:

కుజుడు మేష రాశి వారికి అధిపతిగా వ్యవహరిస్తాడు. కాబట్టి శుక్రుడి సంచారం వల్ల మేష రాశి వారికి అదృష్టం లభించబోతోంది. రాశి వారికి సంచారం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు పెద్ద మొత్తంలో జరుగుతాయి. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపార రంగంలో భారీ మొత్తంలో లాభాలు పొందుతారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఉద్యోగం కూడా లభిస్తుంది. కానీ ఈ క్రమంలో ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల పలు జాగ్రత్తలు వహించడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

తులారాశి:
ఈ శుక్రుని సంచారం వల్ల తుల రాశిలో తీవ్ర మార్పులు రాబోతున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశి వారు సంచార క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వీరు ఆర్థికంగా బలపడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వ్యాపార రంగాల్లో సమస్యలన్నీ తొలగిపోయి లాభాలు వచ్చే ఛాన్స్ ఉందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సంచారం వల్ల పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ఈ క్రమంలో మంచి వస్తువులపైన డబ్బులు ఖర్చుపెడతారు. అంతేకాకుండా కొత్త అవకాశాలు కూడా పొందుతారు.

వృశ్చిక రాశి:
12 రాశుల కంటే ఈ రాశులవారు మంచి ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా నిన్నటి నుంచి వచ్చే రోజులన్నీ వారికి మంచి రోజులేనని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. శుక్ర సంచారము వల్ల  వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. ఈ క్రమంలో డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు పొందే ఛాన్స్‌ ఉందని నిపుణులు తెలుపుతున్నారు. సంచారం వల్ల డబ్బు సంపాదించి అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తారు.

Also Read : Yashoda Movie Copied : యశోదపై ట్రోలింగ్.. దొరికిపోయిన దర్శకులు.. సమంతకు ఎంత కష్టమొచ్చే

Also Read : Bigg Boss 10th week Elimination : డేంజర్‌ జోన్‌లో శ్రీసత్య, శ్రీహాన్‌, ఫైమా.. వేడుకున్న గలాట గీతూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More