Home> ఆధ్యాత్మికం
Advertisement

Shukra Gochar 2023: సింహరాశిలో సంచరిస్తున్న శుక్రుడు..ఈ 3 రాశులకు బంగారు రోజులు మెుదలు..

Shukra Gochar 2023: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మారుస్తాయి. ప్రస్తుతం శుక్రుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడి గోచారం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 
 

Shukra Gochar 2023: సింహరాశిలో సంచరిస్తున్న శుక్రుడు..ఈ 3 రాశులకు బంగారు రోజులు మెుదలు..

Venus Transit 2023 in leo:  లవ్, రొమాన్స్, లగ్జరీ లైఫ్ మరియు సంపదకు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. రెండు రోజుల కిందట అంటే జూలై 07న శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించాడు. మళ్లీ జూలై 23, ఉదయం 6.01 గంటలకు శుక్రుడు ఉదయించబోతున్నాడు. అనంతరం ఆగస్టు 07న కర్కాటక రాశిలోకి వెళ్లనున్నాడు. సెప్టెంబరు 04 వరకు అదే రాశిలో ఉంటాడు. సింహరాశిలో శుక్రుడు సంచారం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

మేష రాశి
మేషరాశికి శుక్రుని సంచారం అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తో ప్రమోషన్ కూడా లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. 
తులారాశి
సింహరాశిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల తులారాశి వారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు. మీరు ఆర్థికంగా లాభపడనున్నారు. వ్యాపారంలో పెట్టుబడుల పెట్టడం వల్ల మీరు ఊహించని ధనలాభం పొందుతారు. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే అనుకూల సమయం.

Also Read: Kamika Ekadashi 2023: కామిక ఏకాదశి నాడు శుభ యోగం.. ఈ 3 రాశులకు శ్రీహరి ప్రత్యేక ఆశీస్సులు..

సింహం
శుక్రుని రాశి మార్పు సింహరాశికి కలిసి రానుంది. మీ వ్యక్తిత్వంతో నలుగురిని ఆకట్టుకుంటారు. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. మీ పేరు ప్రఖ్యాతలు పొందుతారు. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మెుత్తానికి ఈ సమయం కలిసి వస్తుంది. 

Also Read: Sun transit 2023: జూలై 16 నుంచి ఈ 4 రాశులకు మహార్దశ.. ఇందులో మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More