Home> ఆధ్యాత్మికం
Advertisement

Shukra Gochar 2023: మీనరాశిలో వీనస్ సంచారం.. ఈరాశులకు చెప్పలేనంత ధనం..

Shukra Gochar 2023: ప్రస్తుతం మీనరాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. దీని కారణంగా నాలుగు రాశులవారు భారీగా లాభపడనున్నారు. ఇందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి. 
 

Shukra Gochar 2023: మీనరాశిలో వీనస్ సంచారం.. ఈరాశులకు చెప్పలేనంత ధనం..

Shukra Gochar 2023: లవ్, రొమాన్స్, సంపద మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా శుక్ర గ్రహాన్ని భావిస్తారు. ఆస్ట్రాలజీలో ఈ గ్రహాన్ని చాలా శుభగ్రహంగా భావిస్తారు. శుక్రుడి స్థానంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఫిబ్రవరి 15న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడి యెుక్క ఈ రాశి మార్పు కారణంగా నాలుగు రాశులవారి అదృష్టాన్ని ప్రకాశింపజేయనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.

శుక్రుడి సంచారం ఈ రాశులకు శుభప్రదం
మీన రాశి 
మీనంలో శుక్రుని సంచారం ఈ రాశికి చెందిన వారికి అనుకూలంగా ఉంటుంది. మీ వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ మాటలతో ప్రజలను ఆకర్షిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుక్రవారం రోజున మహాలక్ష్మి దేవి మంత్రాన్ని జపించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. 
మకరరాశి
మీనంలో శుక్రుని సంచారం మకరరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో సమయం గడుపుతారు. మీకు ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. బిజినెస్ విస్తరిస్తుంది. మీరు పురోభివృద్ధి సాధిస్తారు. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 
కుంభరాశి
కుంభ రాశి వారికి శుక్ర సంచారం కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు పార్టీల్లో మునిగితేలుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ జీవితంలో సుఖాలు పెరుగుతాయి. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. 
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి మీన రాశిలో శుక్ర సంచారం మేలు చేస్తుంది. మీరు చదువు నిమిత్తం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. లవ్ సక్సెస్ అవుతుంది. శుక్రవారం నాడు అమ్మవారికి ఖీర్ నైవేద్యంగా పెట్టడం వల్ల కలిసి వస్తుంది. 

Also Read; Budh Mahadasha: బుధ మహాదశ ప్రభావం వల్ల కలిగే అద్భుత ఫలితాలేంటో తెలుసా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More