Home> ఆధ్యాత్మికం
Advertisement

Shukra Gochar 2022: జూన్ 18న వృషభరాశిలోకి శుక్ర గ్రహ సంచారం.. మరో 9 రోజుల తర్వాత ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు..!

Shukra Gochar 2022: శుక్ర గ్రహం తన స్వంత రాశి అయిన వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ క్రమంలో రాశీచక్రంలోని మూడు రాశుల వారికి శుక్రగ్రహ సంచారం కారణంగా జీవితంలో ఎన్నడూ లేని డబ్బును పొందుతారు.

Shukra Gochar 2022: జూన్ 18న వృషభరాశిలోకి శుక్ర గ్రహ సంచారం.. మరో 9 రోజుల తర్వాత ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు..!

Shukra Gochar 2022: రాశీచక్రంలో గ్రహాల సంచారం కారణంగా అందులోని రాశులపై ప్రభావం తప్పక ఉంటుంది. ఈ క్రమంలో జూన్ 18న శుక్ర గ్రహం వృషభరాశిలోకి సంచరించబోతోంది. ఈ సంచార సమయంలో శుక్రుడు అన్ని రాశులపై ప్రభావాన్ని చూపిస్తాడు. అయితే శుక్రుడి సంచారం కారణంగా ఈసారి మూడు రాశులపై సానుకూల ప్రభావం కనిపించబోతోంది. ఆయా రాశుల వారు రాబోయే రోజుల్లో కీర్తి ప్రతిష్టలను పొందుతారు. అయితే శుక్రుడి సంచారం కారణంగా ఏఏ రాశుల వారికి మంచి జరుగుతుందో తెలుసుకుందాం.
 
మేషరాశి(Aries):

వృషభరాశిలో శుక్రుని సంచారం మేషరాశి వారికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశి వారు వృత్తిపరంగా ఎన్నో విజయాలను సాధిస్తారు. ముఖ్యంగా వ్యాపారులు లాభపడతారు. చేసే ప్రతిపనిలో లాభం ఉంటుంది. మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి పెట్టుబడి పెట్టవచ్చు. ఇతరుల వద్ద నిలిచిపోయిన డబ్బు అందే అవకాశం ఉంది. శుక్రుడి సంచారం కారణంగా ఈ రాశి వారి ప్రేమ, వైవాహిక జీవితానికి మంచి జరుగుతుంది.

కర్కాటక రాశి(Cancer):

రాశీచక్రంలో శుక్రుని సంచారం కారణంగా కర్కాటక రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి వారి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పనిలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగాలు చేసే వారు ప్రమోషన్ - ఇంక్రిమెంట్ పొందే అవకాశం బలంగా ఉంది. కొత్త మార్గాల్లో ఆదాయాన్ని అన్వేషించడంలో విజయాన్ని సాధిస్తారు. జీవితంలో అన్ని రకాల సౌకర్యాలను పొందుతారు.

సింహరాశి(Leo):

శుక్రుని సంచారంతో సింహరాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగం కోసం ఎదురుచూసే వారు శుభవార్త వింటారు. ఉద్యోగాల్లో స్థానచలనం కోసం ఎదురుచూసే వారికి పని పూర్తవుతుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్ ఉండవచ్చు. అదృష్టం వరిస్తుంది. వ్యాపారులకు కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో పెద్దల సహాయం లభించడం సహా బాగస్వామ్యంగా చేసే పనులు ముందుకొస్తాయి.

Also Read: Internet Speed: క్రమంగా ఇంటర్‌నెట్ వేగం తగ్గుతుందా..అయితే ఈ పని చేయండి..!

Also Read: Heat Stroke: వడ దెబ్బతో బీ అలర్ట్‌..నిర్లక్ష్యం వహిస్తే మీ గుండె, కిడ్ని, లీవర్‌కు ప్రమాదమే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Read More