Home> ఆధ్యాత్మికం
Advertisement

Shukra Gochar 2022: శుక్రుడి సంచారం... ఈ రాశులకు చెడు రోజులు ప్రారంభం..

Grah Gochar 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అన్ని గ్రహాలు నిర్దిష్ట సమయం తర్వాత తమ రాశిని మార్చుకుంటాయి. శుక్ర సంచారం వల్ల  ఏ రాశుల వారు ఇబ్బందులు పడనున్నారో తెలుసుకుందాం. 
 

Shukra Gochar 2022: శుక్రుడి సంచారం... ఈ రాశులకు చెడు రోజులు ప్రారంభం..

Grah Gochar November 2022 : శుక్రుడు ఆనందం, శ్రేయస్సు, సంపద మరియు ఆకర్షణకు కారకుడు. కుంభం, తులరాశులకు అధిపతి శుక్రుడు. . నవంబర్‌లో చాలా గ్రహాలు రాశిచక్రాన్ని మారుస్తాయి. అందులో శుక్రుడు కూడా ఉన్నాడు. నవంబర్ 11న అంటే ఈ రోజున శుక్రుడు తులారాశి నుండి వృశ్చికరాశిలో (Venus transit in Scorpio 2022) ప్రవేశించనున్నాడు. గ్రహం రాశిచక్రాన్ని మార్చినప్పుడల్లా దాని ప్రభావం మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. శుక్రుడి సంచారం వల్ల ఏ రాశులవారు ఇబ్బందులు పడనున్నారో తెలుసుకుందాం. 

తులారాశి(Libra): శుక్రుడి సంచారం వల్ల ఈ రాశివారికి సమస్యలు పెరుగుతాయి. అంతేకాకుండా ఈ రాశి యెుక్క రెండో ఇంట్లో శుక్రుడు సంచరించనున్నాడు. దీంతో ఈరాశివారికి ఆర్థిక సమస్యలుపెరుగుతాయి. అదే విధంగా ఈ సమయంలో పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. 
మిథునం (Gemini): మిథునరాశి వారికి శుక్రుని సంచారం ఇబ్బందిని కలిగిస్తుంది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికంగా సమస్యలను ఎదుర్కోంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. మెుత్తానికి ఈ సమయం మీకు అనేక నష్టాలను మిగులుస్తుంది. 
వృశ్చిక రాశి (Scorpio): వృశ్చికరాశిలో మొదటి ఇంటిలో శుక్రుని సంచారం జరుగుతోంది. ఈ కారణంగా ఈరాశివారు అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. డబ్బు దుబారా ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్లాన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి.
కర్కాటకం(Cancer): కర్కాటక రాశి వారి జాతకంలో ఐదవ ఇంట్లో శుక్రుని సంచారం జరగబోతోంది. అందువల్ల ఈ రాశిచక్రం ఈ వ్యక్తులకు శుభప్రదంగా ఉండనుంది. ఈరాశివారు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తుతాయి. 

జ్యోతిష్య పరిహారాలు: జొన్నలు లేదా ఆహార పదార్థాలను దానం చేయడం, పేద పిల్లలకు లేదా విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేస్తే శుక్రుడు శాంతిస్తాడు. ప్రతిరోజు ఆవుకి ఆహారం తినిపిస్తే.. మీ జాతకంలో శుక్రుడు బలపడతాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వెండి, కర్పూరం, బియ్యం లేదా ఏదైనా తెలుపు రంగు పువ్వును దానం చేయడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు జాతకంలో బలహీనమైన శుక్రుడిని శాంతింపజేయడానికి లాభదాయకంగా ఉంటారు. శుక్రవారం రోజున తెల్లని వస్త్రాలు, పాలు, పెరుగు మొదలైన వాటిని దానం చేయడం వల్ల శుక్రుడు సంతోషిస్తాడు. ప్రతి శుక్రవారం తెల్లటి ఆవు లేదా ఎద్దుకు మేత తినిపించడం వల్ల సానుకూల ఫలితాలను పొందుతారు. 

Also Read: Vensu Transit 2022: ఈ రోజు నుండి ఈ 4 రాశుల అదృష్టం మారిపోనుంది... వీరికి డబ్బే డబ్బు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More