Home> ఆధ్యాత్మికం
Advertisement

Shani Dev: శనివారం నాడు ఇలా చేస్తే.. శనిదేవుడు మీకు ఊహించనంత ధనాన్ని ఇస్తాడు..

Shani Dev: ఆస్ట్రాలజీలో శనిదేవుడికి చాలా ప్రత్యేకత ఉంది. శనిదేవుడి అనుగ్రహం ఎవరిపై ఉంటుందో వారికి దేనికీ లోటు ఉండదు. శనిదేవుడిని ప్రసన్నం చేసుకునే మార్గాలేంటో తెలుసుకుందాం. 
 

Shani Dev: శనివారం నాడు ఇలా చేస్తే.. శనిదేవుడు మీకు ఊహించనంత ధనాన్ని ఇస్తాడు..

Saturday Shani Dev Remedies: సనాతన ధర్మం ప్రకారం, వారంలో ప్రతి రోజూ ఏదో ఒక దేవుడిని పూజిస్తారు. శనివారం శనిదేవుడిని ఆరాధిస్తారు. ఇదే రోజు హనుమాన్ ను కూడా పూజిస్తారు. ఈరోజున ఆంజనీపుత్రుడిని ఆరాధిస్తే శనిదేవుడు (Shani Dev) కూడా సంతోషిస్తాడు. మనం చేసే మంచి, చెడులను బట్టి ఫలాలను ఇచ్చేవాడు శనిదేవుడు. అందుకే శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అంటారు. శనిదేవుడి అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. శని వక్ర దృష్టి పడితే ధనవంతుడు కూడా దరిద్రుడిగా మారతాడు. అందుకే శనిదేవుడి కృప ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. శనిదేవుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసుకుందాం. 

శనిదేవుడి అనుగ్రహం పొందాలంటే...
>> శనగపప్పులో కొంత గోధుమపిండి వేసి మెత్తగా నూరి ఈ పిండిలో శనివారం నాడు 1 లేదా 2 తులసి ఆకులు వేసి బాగా నూరుకోవాలి. ఈ పిండితో రోటీ చేయండి. మొదటి రోటీని ఆవుకు మాత్రమే పెట్టండి, చివరి రోటీని కుక్కకు తినిపించండి. ఇలా చేయడం వల్ల శనిదేవుడు దయ మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. 
>> ఇంట్లో ధూపం వేయడం ద్వారా ప్రతికూల శక్తి నశిస్తుంది అని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. అంతే కాకుండా శని దేవుడికి సుగంధ ద్రవ్యాలు చాలా ఇష్టం. మీరు శనివారం నాడు ఇంట్లో ధూపం వేస్తే శని దేవుడు సంతోషించి మీపై వరాల జల్లు కురిపిస్తాడు. 
>> శనివారం నాడు హనుమాన్ ఆలయంలో నిమ్మకాయతోపాటు నాలుగు లవంగాలు పెట్టి ఆంజనేయస్వామి పాదాల చెంత ఉంచండి. ఆ నిమ్మకాయను మీతోపాటు తీసుకెళ్లండి. ఇలా చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. 

Also Read: Malavya Rajyog: 2023లో శుక్రుడు ఈ 3 రాశులవారికి అంతులేని ఐశ్వర్యాన్ని ఇవ్వనున్నాడు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Read More