Home> ఆధ్యాత్మికం
Advertisement

Shanivar Puja: శనివారం శని దేవుడి పూజ.. లవంగంతో ఇలా చేస్తే తిరుగులేని అదృష్టం..

Shanivar Shani Puja: శనివారం శని దేవుడి ఆరాధనకు అంకితం చేయబడింది. ఈ రోజు పూజా సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తిరుగులేని అదృష్టం మీ సొంతమవుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ రోజు దీపంలో ఈ ఒక్క వస్తువును చేర్చడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి.
 

 Shanivar Puja: శనివారం శని దేవుడి పూజ.. లవంగంతో ఇలా చేస్తే తిరుగులేని అదృష్టం..

Shanivar Shani Puja: హిందూ శాస్త్రాలు, పురాణాల ప్రకారం.. పూజా క్రతువులో దీపారాధన చాలా ముఖ్యం. అయితే ఒక్కో దేవతకు, దేవుడికి దీపారాధన ప్రత్యేకంగా ఉంటుంది. శాస్త్రం ప్రకారం శని దేవుడికి చేసే దీపారాధనలో లవంగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించి.. అందులో రెండు లవంగాలు వేయాలి. ఇలా లవంగంతో కూడిన దీపాన్ని వెలిగించడం ద్వారా ఆ ఇంట్లోని దుష్ట శక్తులు, నెగటివిటీ తొలగిపోతాయి. దోష పరిష్కారం లభిస్తుంది. తద్వారా శని దేవుడి అనుగ్రహం పొందుతారు.  దీనితో పాటు మరికొన్ని నియమాలను పాటించినట్లయితే శని దేవుడి అనుగ్రహంతో అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది.

ఈ నియమాలు తప్పక పాటించాలి:

హిందూమతంలో పూజలు, మతపరమైన ఆచారాలకు కర్పూరం ఉపయోగించబడుతుంది. ఇంట్లో ఉన్న ప్రతికూలతలను తొలగించడానికి కర్పూరం వెలిగిస్తారు. 

మత గ్రంథాలలో దాతృత్వానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కాబట్టి శనివారం రోజున పేదలకు అన్నదానం, వస్తు దానం, ఆర్థిక దానం చేయండి.

పశుపక్షాదులకు మేత, నీళ్లు పెట్టండి. ప్రకృతి ఒడిలో సంచరించే మూగ జీవాల ఆకలి తీర్చడం ద్వారా మీపై శని దేవుడి అనుగ్రహం ఉంటుంది.

ఇంటి నిండా ధనం, ధాన్యాలు ఉండాలంటే వేడి వేడి పెనం మీద పాలు పోసి రోటీలు చేయాలి. ఇలా చేస్తే డబ్బుకు లోటు ఉండదని నమ్ముతారు.

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Sai Pallavi Virata Parvam Twitter Review: 'విరాటపర్వం' ట్విట్టర్ రివ్యూ... సినిమా ఎలా ఉందంటే.. 

Also Read: Live Video-Agnipath Protest in HYD: తెలంగాణకు తాకిన అగ్నిపథ్‌ సెగలు..పోలీసుల కాల్పుల్లో పలువురు మృతి..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More