Home> ఆధ్యాత్మికం
Advertisement

Shani Remedies: శనివారం శనిదేవుడికి ఇలా చేస్తే మీ అదృష్టం మారిపోతుంది!

Shani Remedies:  శనివారం ప్రజలు శనిదేవుడిని పూజిస్తారు.  ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని చర్యలు తీసుకుంటారు. 
 

Shani Remedies:  శనివారం శనిదేవుడికి ఇలా చేస్తే మీ అదృష్టం మారిపోతుంది!

Shani Remedies: మనం చేసే పనులన్నీ బట్టి ఫలాలను ఇచ్చే దేవుడు శని. అందుకే శనిని న్యాయదేవుడు అని అంటారు. ఎవరి జాతకంలో అయితే శని అశుభస్థానంలో ఉంటాడో.. ఆ వ్యక్తి లైఫ్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అందుకే భక్తులు శనిదేవుడిని (Shanidev) ప్రసన్నం చేసుకోవడానికి అనేక చర్యలు తీసుకుంటారు. శనివారం శనిదేవుడిని పూజిస్తారు. అందుకే ఈ రోజు శనిదేవుడి అనుగ్రహం పొందడానికి కొన్ని పరిహారాలు చేయాలి. అవేంటో తెలుసుకుందాం. 

శని దేవుడిని ప్రసన్నం చేసుకునే పరిహారాలు
>> మీరు శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే.. సూర్యాస్తమయం తర్వాత హనుమంతుని పూజించండి. ఆంజనేయుడి ఆరాధించేటప్పుడు స్వామికి కుంకుమ బొట్టు పెట్టి... ఆయన ముందు నల్లనువ్వుల నూనెతో దీపం వెలిగించండి. పూజలో నీలం పువ్వులు సమర్పించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. 
>>  శని ఆగ్రహానికి గురై జీవితంలో కష్టాలు చుట్టుముట్టినట్లయితే శనివారం నాడు శని యంత్రాన్ని ప్రతిష్టించి పూజించాలి. ఈ యంత్రాన్ని ప్రతిరోజూ పూర్తి ఆచారాలతో ఆరాధించాలి. దీంతో శనిదేవుడు చాలా సంతోషిస్తాడు. శని యంత్రం ముందు ఆవనూనె దీపం వెలిగించి, రోజూ నీలిరంగు పుష్పాలను సమర్పించడం ద్వారా శనిదేవుని అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. 
>> పూజకు ఒక రోజు ముందు 1.25 కిలోల నల్ల మినుములను విడిగా మూడు పాత్రలలో నానబెట్టండి. మరుసటి రోజు స్నానం చేసిన తర్వాత, ఆ నల్ల శనగలను శని దేవుడికి పూజలో సమర్పించండి. పూజానంతరం గేదెకు ముందుగా కొన్ని పప్పులు తినిపించాలి. మిగిలిన వాటిని కుష్టు రోగులకు పంపిణీ చేయాలి. 
>> శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి సులభమైన మార్గం ఆవుకి సేవ చేయడం. నల్ల ఆవుకి సేవ చేయడం ద్వారా, శని దేవుడి సంతోషించి అతనిని ఆశీర్వదిస్తాడు. 

Also Read: Dhantrayodashi 2022: ధన త్రయోదశి ఎప్పుడు? ఈ రోజు బంగారాన్ని ఎందుకు కొంటారు? 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More