Home> ఆధ్యాత్మికం
Advertisement

Shani Vakri 2023: శని తిరోగమనం ఈ 3 రాశులకు వరం.. ఇందులో మీది ఉందా?

Vakri Shani 2023: ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. శని గ్రహం యెుక్క ఈ వ్యతిరేక కదలిక మూడు రాశులవారికి మంచి లాభాలను ఇవ్వనుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 

Shani Vakri 2023: శని తిరోగమనం ఈ 3 రాశులకు వరం.. ఇందులో మీది ఉందా?

Shani Dev Retrograde 2023 effect: శనిదేవుడు పేరు వింటేనే చాలా మంది భయపడతారు. ప్రతి ఒక్కరూ శని చెడు దృష్టి తమపై పడకూడదని అనుకుంటారు. మనం చేసే మంచి చెడులను బట్టి ఫలితాలను ఇచ్చే దేవుడు శని. అందుకే ఇతడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. ఇతడి అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. ప్రస్తుతం శని గ్రహం కుంభరాశిలో తిరోగమనంలో ఉంది. శనిదేవుడి వ్యతిరేక కదలిక మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.

తిరోగమన శని ఈ రాశులకు వరం

సింహరాశి

శని యొక్క తిరోగమన కదలిక సింహరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. శనిదేవుడు శష్ అనే రాజయోగాన్ని సృష్టిస్తున్నాడు. మీరు ఆఫీసులో పెద్ద బాధ్యతలు తీసుకుంటారు. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ ఉంటుంది. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో మంచి విజయం సాధిస్తారు. మీరు ఆర్థికంగా లాభపడతారు.

వృషభం

శనిదేవుని వ్యతిరేక కదలిక వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ జాతకంలో పదో ఇంట్లో తిరోగమనం చేశాడు. మీరు కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఉద్యోగులు మంచి పురోగతి సాధిస్తారు. ఆఫీసులో మీకు సహోద్యోగుల సపోర్టు లభిస్తుంది. ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్ వస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది.

మకరరాశి

శని గ్రహం రివర్స్ కదలిక మకరరాశి వారికి ఆకస్మిక ధనలాభాన్ని ఇస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగులు మంచి ప్రయోజనం పొందుతారు.

Also Read: Shukra-Mangal Yuti: సింహరాశిలో రెండు పెద్ద గ్రహాల కలయిక.. ఈ 3 రాశులవారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

 

Read More