Home> ఆధ్యాత్మికం
Advertisement

Shani Margi 2022: అక్టోబరు 23న మార్గంలోకి శనిదేవుడు... శని ఆగ్రహం నుండి ఈ రాశులకు విముక్తి...

Shani Margi 2022: శనిదేవుడు ప్రస్తుతం మకరరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. అక్టోబరు 23నుండి శనిదేవుడు ప్రత్యక్ష సంచారంలోకి వస్తాడు. శనిదేవుడి సంచారం కొన్ని రాశులవారికి కలిసి రానుంది. 
 

Shani Margi 2022: అక్టోబరు 23న మార్గంలోకి శనిదేవుడు... శని ఆగ్రహం నుండి ఈ రాశులకు విముక్తి...

Shani Margi 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, నెమ్మదిగా కదిలే గ్రహాల్లో శని ఒకటి. శనిదేవుడు రెండున్నరేళ్లకు ఒకసారి తన రాశిని మారుతాడు. మంచి చెడులను బట్టి ఫలాలను ఇస్తాడు కాబట్టి శనిదేవుడిని కర్మదాత, న్యాయదేవుడు అంటారు. ప్రస్తుతం మకరరాశిలో శనిదేవుడు తిరోగమనంలో ఉన్నాడు.  అక్టోబరు 23 నుండి శనిదేవుడు మకరరాశిలో ప్రత్యక్ష సంచారంలోకి (Shani Margi 2022) వస్తుంది. శని మార్గంలోకి వచ్చిన తర్వాత కొంత మంది వ్యక్తులు శని కోపం నుండి విముక్తి పొందుతారు.  

మేషం (Aries)- శని సంచారం ఈ రాశి యెుక్క పదో ఇంట్లో జరుగుతుంది. దీని వల్ల వ్యాపారులు భారీగా లాభపడనున్నారు. అంతేకాకుండా ఉద్యోగులకు అనేక కొత్త జాబ్ ఆఫర్లు వస్తాయి. ఈ రాశివారు భారీగా సంపదను పొందుతారు. 

కర్కాటకం (Cancer)- ఈ రాశిలోని ఏడవ ఇంట్లో శనిదేవుడు సంచరిస్తాడు. శని మకరరాశిలోకి ప్రవేశించిన తరువాత ఈ రాశివారి జీవితం నుండి దుఃఖాలు తొలగిపోతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ లైఫ్ పార్టనర్ నుండి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది. 

తుల (Libra)- శని ఈ రాశిలోని నాల్గవ ఇంట్లో సంచరిస్తాడు. ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశివారు శుభవార్త వింటారు. తుల రాశి వారి ఆర్థిక పురోగతికి అవకాశం ఉంది. 

వృశ్చికం (Scorpio)- మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. మీరు పెట్టుబడి పెట్టడానికి ఈ టైం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 

మీనం (Pisces)- ఈ రాశివారు ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు.  ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. వీరి జీవితం ఆనందమయం అవుతుంది. 

Also Read: Mahalaya Amavasya 2022: అశ్వినీ అమావాస్య ఎప్పుడు, శుభ సమయం, ప్రాముఖ్యత 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More