Home> ఆధ్యాత్మికం
Advertisement

Shani Margi 2022: అక్టోబరు 23 నుంచి శనిమహాదశ నుండి ఈ రాశులకు విముక్తి, ఈ రాశులకు భారీగా డబ్బు..!

Shani Margi 2022: జూన్ 5న శనిగ్రహం తిరోగమనంలోకి వెళ్లింది. మకరరాశిలో తిరోగమన శని సంచారం 141రోజులపాటు ఉంటుంది. ఇది అక్టోబర్ 23తో ముగుస్తుంది. దీంతో శనిమహాదశ నుండి కొన్ని రాశులవారికి ఉపశమనం కలగనుంది. మరికొన్ని రాశులవారికి లాభం చేకూరనుంది. 
 

Shani Margi 2022: అక్టోబరు 23 నుంచి శనిమహాదశ నుండి ఈ రాశులకు విముక్తి, ఈ రాశులకు భారీగా డబ్బు..!

Shani Margi Effect 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, అన్ని గ్రహాలలోకెల్లా నెమ్మదిగా కదిలే గ్రహం శని. ఇది ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది. జూన్ 5వ తేదీని శనిగ్రహం మకరరాశిలోకి తిరోగమించింది. దీని తిరోగమన సంచారం 141 రోజులుపాటు కొనసాగి అక్టోబరు 23న ముగుస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఒక గ్రహం తిరోగమనంలో ఉన్నప్పుడు దాని శుభ ప్రభావాలు తగ్గుతాయి.

ఈ రాశులకు విముక్తి
ప్రస్తుతం సమయంలో మిథునం, తుల రాశివారు శని ధైయాను ఎదుర్కొంటుంటే.. కుంభం, ధనస్సు, మకర రాశులవారు శని యెుక్క సాడే సతితో భాదపడుతున్నారు. ఈ ఐదు రాశులవారికి అక్టోబరు 23న శని తిరోగమనం నుంచి మార్గంలోకి వచ్చిన తర్వాత ఉపశమనం లభిస్తుంది. అనంతరం శని 17 జనవరి 2023న మళ్లీ తన సొంత రాశిచక్రం కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది. శని తన సొంత రాశిలోకి ప్రవేశించిన  వెంటనే ధనస్సు రాశివారికి సాడే సతి నుండి విముక్తి లభిస్తుంది. అదే సమయంలో మిథున, తుల రాశి ప్రజల ధైయా నుండి బయటపడతారు. 

ఈ రాశులకు లాభం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల కదలికల యొక్క శుభ మరియు అశుభ ప్రభావాలు మొత్తం 12 రాశుల మీద కనిపిస్తాయి. అక్టోబరు 23న శని సంచారం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వృషభం, కన్య, ధనుస్సు రాశుల వారు భారీగా లాభపడనున్నారు. ఈ రాశులవారు అపారమైన సంపదను పొందుతారు. వ్యాపారంలో భారీగా లాభాలను ఆర్జిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగస్తుల ఆదాయం పెరుగుతుంది. 

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Also Read: Mercury Transit 2022: కన్యా రాశిలోకి బుధ గ్రహం.. ఈ నాలుగు రాశుల వారికి లక్కీ టైమ్ స్టార్ట్ అయినట్లే.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More